బుధవారం 02 డిసెంబర్ 2020
Adilabad - Oct 29, 2020 , 01:31:27

నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు

నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు

  • ఆదిలాబాద్‌ అదనపు కలెక్టర్‌ డేవిడ్‌

ఎదులాపురం : ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని పంచాయతీ కార్యదర్శులను ఆదిలాబాద్‌ అదన పు కలెక్టర్‌ ఎం డేవిడ్‌ హెచ్చరించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో బుధవారం మండల అ భివృద్ధి, మండల పరిషత్‌ అధికారులతో పలు అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు సే వలందించేందుకే ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులను నియమించిందని, స్థానికంగా ఉండి విధులు నిర్వర్తించాలని సూచించారు. మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు.

గ్రామాల్లో విద్యుత్‌ చార్జీల బకాయిలు, ప్రజల ఆస్తుల వివరాల సేకరణ, పారిశుధ్యం, వైకుంఠధామాల నిర్మాణాలు, పల్లె ప్రకృతి వనా లు, కంపోస్ట్‌ షెడ్ల నిర్మాణాలు, వచ్చే ఏడాదికి నర్సరీల ఏర్పాటు ప్రణాళికలు, మొక్కల సంరక్షణ, ఉపాధి హామీ పథకంపై మండలాల వారీగా ఎంపీడీవోలతో సమీక్షించారు. అంతకుముందు ‘ఆత్మ నిర్భర్‌ అభియాన్‌' కింద మంజూరైన రుణాలపై బ్యాంకుల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదిలాబాద్‌ మున్సిపల్‌ పరిధిలో 6,318 దరఖాస్తులు రాగా, ఇప్పటి వరకు 3,858 మందికి రుణాలు మంజూరయ్యాయన్నారు.

2,460 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, 421 యూనిట్లు గ్రౌండింగ్‌ చేసినట్లు చెప్పారు. పలు కారణాల వల్ల 1254 దరఖాస్తులను తిరస్కరించామన్నారు. మంజూరైన యూనిట్లను వెంటనే గ్రౌండింగ్‌ చేయాలని బ్యాంకర్లకు సూచించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, రుణాలు మంజూరుచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో కిషన్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రాజేశ్వర్‌ రాథోడ్‌, ఎల్‌డీఎం చంద్రశేఖర్‌, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌, మున్సిపల్‌ ఇన్‌చార్జి కమిషనర్‌ సీవీఎన్‌ రాజు, ఏపీడీ రవీందర్‌, ఆయా బ్యాంక్‌ల మేనేజర్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు పాల్గొన్నారు.