ఆదివారం 24 జనవరి 2021
Adilabad - Oct 27, 2020 , 02:11:11

ధూంధాంగా దసరా వేడుకలు

ధూంధాంగా  దసరా వేడుకలు

  • ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా అంబరాన్నంటిన సంబురాలు

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆదివారం దసరా వేడుకలు ధూంధాంగా జరిగాయి. నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని బంగల్‌పేట్‌ మహాలక్ష్మి ఆలయంలో నిర్వహించిన ఉత్సవాల్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి శమీ పూజ చేయగా, పలుచోట్ల ఎమ్మెల్సీ, జడ్పీ చైర్మన్‌లు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో  ఆయుధ, వాహన పూజలు చేయగా, ఇక భక్తుల దర్శనాలతో ఆలయాలన్నీ సందడిగా మారాయి.  ‘రామ్‌లీల’ కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. రావణుడి బొమ్మల దహనంతో వేడుకలు ముగిశాయి. మరోవైపు తొమ్మిది రోజుల పాటు  విశేష పూజలందుకున్న దుర్గామాత ప్రతిమలను సోమవారం వాగులు, చెరువుల్లో నిమజ్జనం చేశారు. భైంసా  పట్టణంలో పోలీసుల భారీ బందోబస్తు నడుమ శోభాయాత్ర ప్రశాంతంగా  సాగింది.  


logo