బుధవారం 25 నవంబర్ 2020
Adilabad - Oct 23, 2020 , 00:31:58

కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర

కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర

  • ఆదిలాబాద్‌ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌
  • పత్తి, వరి ధాన్యం కొనుగోళ్లపై వివిధ శాఖల అధికారులతో సమావేశం

ఎదులాపురం:  జిల్లాలో పత్తి, వరి ధాన్యం పంటలకు కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధ ర కల్పిస్తున్నట్లు కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ చెప్పారు. పత్తి,  వరి ధాన్యం కొనుగోళ్లపై కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో గురువా రం ఆయా శాఖల అధికారులు, సీసీఐ ప్రతి నిధులతో సమావేశం నిర్వహించారు. ముం దుగా కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన పోస్టర్‌, కరపత్రాలను  క లెక్టర్‌ ఆవిష్కరించారు.

అనంతరం వరి ధా న్యంపై సమీక్షిస్తూ, జిల్లాలో 1646 ఎకరాల ల్లో వరిని సాగు  చేశారని, సుమారు 4115 మెట్రిక్‌ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందన్నారు. వీటిని మూడు కొనుగోలు కేం ద్రాల్లో వచ్చే నెల రెండు లేదా 3వ వారంలో మహిళా సంఘాల ద్వారా కొంటామని తెలిపారు. గ్రేడ్‌-ఏ ధాన్యం క్వింటాలుకు రూ. 1888, సాధారణ వరి ధాన్యానికి రూ. 1868తో కొనుగోలు చేస్తామని పేర్కొన్నా రు. అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా పౌర సరఫరాల అధికారిని కలెక్టర్‌ ఆదేశించా రు. అనంతరం పత్తి కొనుగోళ్లపై సమీక్షిస్తూ జిల్లాలో 4.21,343 ఎకరాల్లో పత్తి సాగు చేశారని, 47.93 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు తెలిపినట్లు చెప్పారు.  పత్తికి సీసీఐ ద్వారా 10 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి క్వింటాలుకు  రూ.5825 చెల్లించి నిబంధనల మేరకు కొనుగోలు చేస్తామన్నారు. సీసీఐ నిబంధనల ప్రకారం 8 శాతం తేమ కలిగిన పత్తిని కొనుగోలు చేస్తుందని తెలిపా రు. రైతులు పత్తి పంటను ఆరబెట్టుకొని కేం ద్రాలకు తీసుకురావాలన్నారు. కౌలు రైతు లు పండించిన పత్తి పంటను విక్రయించడానికి వ్యవసాయ విస్తరణ అధికారులు ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారని పేర్కొన్నారు. 

గ్రామాల వారీగా, రైతుల వారీగా పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లేందుకు నిర్ణీత తేదీతో కూపన్లు జారీ చేస్తారని పేర్కొన్నారు. కూపన్లు తీసుకొనే కేంద్రాలకు రావాలన్నా రు. పత్తికి చెల్లించే డబ్బులు ఆయా రైతుల బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేస్తారని తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు వెళ్లే సమ యంలో అధార్‌కార్డు, బ్యాంక్‌ అకౌంట్‌ జిరాక్స్‌ కాపీలను తీసుకురావాలన్నారు. పత్తి తేమ శాతాన్ని  కొలిచే విధానాన్ని కలెక్టర్‌ స్వ యంగా పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.  అదనపు కలెక్టర్లు జీ సంధ్యారాణి, ఎం. డేవిడ్‌, ఆర్డీవో జాడి రాజేశ్వర్‌, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటి , జిల్లా పౌర సరఫరాల అధికారి సుదర్శనం, మార్కెటింగ్‌ అధికారి అశ్వక్‌, సీసీఐ అసిస్టెంట్‌ మేనేజర్‌ సఘాటియా, సచిన్‌ షిండే, ఉట్నూర్‌ తహసీల్దార్‌ సతీశ్‌, అగ్నిమాపక, తూనికలు కొలత ల అధికారులు, సీసీఐ మార్కెటింగ్‌ సిబ్బం ది, తదితరులున్నారు.