బుధవారం 25 నవంబర్ 2020
Adilabad - Oct 22, 2020 , 00:23:36

సమీకృత మార్కెట్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి

సమీకృత మార్కెట్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి

  • రెండు రోజుల్లో స్థలాన్ని పరిశీలించి నివేదిక అందించాలి
  • అధికారులకు కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ ఆదేశం

ఎదులాపురం :   సమీకృత మార్కెట్‌ ఏర్పాటు పనులు వేగవంతం చేయాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ ఆదేశించారు.  బుధవారం కలెక్టరేట్‌  చాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమీకృత మార్కెట్‌ ఏర్పాటుకు  నీటి పారుదల శాఖ క్వార్టర్స్‌ భూమిని గుర్తించామని, అవసరమైతే సమీపంలోని తపాలా శాఖకు కేటాయించిన స్థలాన్ని సేకరించాలని తెలిపారు. ఈ స్థలాన్ని మున్సిపల్‌, రెవెన్యూ , ఇరిగేషన్‌ శాఖల అధికారులు సంయుక్తంగా పరిశీలించాలన్నారు. రెండు రోజుల్లో  నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ప్రభు త్వ ఆదేశాల మేరకు సమీకృత మార్కెట్‌ ఏర్పాటు పనులు వేగవంతం చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు జీ సంధ్యారాణి, ఎం. డేవిడ్‌, ఆర్డీవో జాడి రాజేశ్వర్‌, నీటి పారుదల శాఖ ఈఈ ఫారూఖ్‌ అహ్మద్‌, ఇన్‌చార్జి మున్సిపల్‌ కమిషనర్‌  సీవీఎన్‌ రాజు, పట్టణ తహసీల్దార్‌ భోజన్న, భూ కొలతల సహాయ సంచాలకుడు రాజేందర్‌, కలెక్టరేట్‌ పర్యవేక్షకురాలు సుశీల, తపాలాశాఖ, వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.