బుధవారం 25 నవంబర్ 2020
Adilabad - Oct 22, 2020 , 00:13:40

బాసర ట్రిపుల్‌ఐటీకి 23మంది ఎంపిక

బాసర ట్రిపుల్‌ఐటీకి 23మంది ఎంపిక

ఆదిలాబాద్‌ రూరల్‌ : ఆదిలాబాద్‌ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువు తున్న 23 మంది విద్యార్థులు ఈ ఏడాది బాసర ట్రిపుల్‌ఐటీకి ఎంపికయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి రవీందర్‌రెడ్డి తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, జడ్పీ, ఆదర్శ పాఠశాలల నుంచి ఇంత మంది విద్యార్థులు ఎంపిక కావడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లభిస్తుందనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు మరింత కష్టపడి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి కృషి చేయాలన్నారు. అనంతరం ఎంపికైన విద్యార్థుల జాబితాను ప్రకటించారు.

 ఎంపికైన విద్యార్థులు..

శేఖ్‌ తన్వీర్‌, రాథోడ్‌ తరుణ్‌ (ఆదర్శ పాఠశాల, నార్నూర్‌), మంద నిఖిత, గుంటుకం రోహిణ, కుంట అనుషిత, సిలారీ గంగోత్రి (ఆదర్శ పాఠశాల, బోథ్‌), పుస్కర్‌ దివ్య, వి.దివ్య, సీహెచ్‌ చంద్రకాంత్‌ (ఆదర్శ పాఠశాల, గుడిహత్నూర్‌), మద్దుల మానస, దారుట్ల సాయికిరణ్‌ (ఆదర్శ పాఠశాల, జైనథ్‌), ఏ మణికంఠ (ఆదర్శ పాఠశాల, బంగారుగూడ), ఏ శ్రీజ (జడ్పీహెచ్‌ఎస్‌, సుంకిడి), డి.నిఖిత (జడ్పీహెచ్‌ఎస్‌, బాలాపూర్‌), ఎన్‌ రుషికేశ్‌ (జడ్పీహెచ్‌ఎస్‌, తలమడుగు), ఎం ఆదిత్య, వివేక్‌ (జడ్పీహెచ్‌ఎస్‌, జైనథ్‌), అంకిత (ప్రభుత్వ పాఠశాల, మహాలక్ష్మీ వాడ, తిర్పెల్లి), డీ అనూష (జడ్పీహెచ్‌ఎస్‌, కుచులాపూర్‌), శివమూర్తి (జడ్పీహెచ్‌ఎస్‌, ఇంద్రవెల్లి) ఎంపికైన వారిలో ఉన్నారు.