బుధవారం 02 డిసెంబర్ 2020
Adilabad - Oct 20, 2020 , 06:16:19

ఆన్‌లైన్‌ తరగతులను వినియోగించుకోవాలి

ఆన్‌లైన్‌ తరగతులను వినియోగించుకోవాలి

ఇచ్చోడ : కొవిడ్‌-19 నేపథ్యంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ తరగతులను వినియోగించుకోవాలని విద్యార్థులకు కస్తుర్బాగాంధీ బాలికల పాఠశాల ప్రిన్సిపాల్‌ మల్లిక సూచించారు. మండలంలోని దాబా (బీ), దాబా (కే), సోన్‌పల్లి గ్రామాల్లో కస్తుర్భాగాంధీ బాలికల పాఠశాలను  ఉపాధ్యాయులు సందర్శించి, ఆన్‌లైన్‌ తరగతుల ద్వారా విద్యార్థులు నేర్చుకుంటున్న అంశాల తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడా రు. కరోనా వైరస్‌ ప్రభావం వల్ల ఇంట్లో ఉంటున్న విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాస్‌లు ఉపయోగపడుతున్నాయని చెప్పారు. అనం తరం తరగతులను వినియోగించుకుంటున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఆన్‌లైన్‌ క్లాస్‌ లు బాగున్నాయని, సులభంగా అర్థమవుతున్నాయని విద్యార్థులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అర్చన, నీలిమా, ప్రియాంక, ఝాన్సీ, సవిత ఉన్నారు.

నేరడిగొండ : ఆన్‌లైన్‌ తరగతులను వినియోగించుకుంటున్న తీరును తేజాపూర్‌లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఇళ్లకు పాఠశాల హెచ్‌ఎం రమేశ్‌, ఉపాధ్యాయులు వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్‌-19 నేపథ్యంలో ప్రభుత్వం ఆన్‌లైన్‌ తరగతుల ద్వారా విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించేలా ప్రభుత్వం ప్రత్యే క చర్యలు తీసుకున్నదని తెలిపారు. ఇంటి వద్దే ఉండి తరగతులు నేర్చుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాస్‌గౌడ్‌, వెంకటేశ్‌, అజయ్‌ కిశోర్‌, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

సిరికొండ :  రిమ్మ ప్రాథమిక పాఠశాలను ఆదిలాబాద్‌ అర్బన్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ ఉపాధ్యాయులు సందర్శించారు. బడులు తెరవక పోవడంతో  విద్యార్థులు బేసిక్స్‌ మరిచిపోతున్నారని, ముందుగా వాటిని అభ్యసించాలని 

యూఆర్‌ఎస్‌ ప్రత్యేకాధికారి ప్రశాంత్‌ రెడ్డి  సూచించారు. సర్పంచ్‌ పెందూర్‌ అనిల్‌ మాట్లాడుతూ..విద్యార్థులను గ్రూపులుగా విభజించి ఆన్‌లైన్‌ పాఠాలను శ్రద్ధగా వినేలా కృషి చేయాలని కోరారు. ఆయన వెంట రవికాంత్‌, అడ రాము ఉన్నారు.