మంగళవారం 27 అక్టోబర్ 2020
Adilabad - Oct 19, 2020 , 02:09:03

ఘనంగా దేవీ శరన్నవరాత్రోత్సవాలు

ఘనంగా దేవీ శరన్నవరాత్రోత్సవాలు

బోథ్‌: నవరాత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం మండల కేంద్రంతో పాటు ధన్నూర్‌(బీ), కౌఠ (బీ), సొనాల, కన్గుట్ట గ్రామాల్లోని దుర్గామాత మండపాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. పలువురు భక్తులు దుర్గామాతను మండపంలో ప్రతిష్ఠించిన రోజు నుంచి దీక్షలు చేపట్టారు.

ఉట్నూర్‌: మండల కేంద్రంలోని హనుమాన్‌ ఆలయంలో కమిటీ సభ్యులు దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు రమేశ్‌, సభ్యు లు అంజన్న, రామగిరి శ్రీనివాస్‌, గంగాధర్‌, ఆలయ కమిటీ సభ్యులు చింతల భీమన్న, సంపత్‌, శ్రీనివాస్‌, సాడిగే చిన్న రాజన్న, శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

భీంపూర్‌: మండల కేంద్రంతో పాటు అంతర్గాం, అర్లి(టి), కామట్‌వాడ, పిప్పల్‌కోటి గ్రామాల్లో దుర్గాదేవి శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. కామట్‌వాడలో జడ్పీటీసీ రాజు, సర్పంచ్‌ లావణ్య, పిప్పల్‌కోటిలో వైస్‌ఎంపీపీ గడ్డం లస్మన్న అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.logo