మంగళవారం 27 అక్టోబర్ 2020
Adilabad - Oct 19, 2020 , 02:09:03

పట్టణ అభివృద్ధే ధ్యేయం

పట్టణ అభివృద్ధే ధ్యేయం

హరితహారంలో నాటిన మొక్కలు సంరక్షించాలి

మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌

 ఆదిలాబాద్‌ రూరల్‌: పట్టణాన్ని అభివృద్ధి చేయడమే తమ ధ్యేయమని మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఫిల్టర్‌బెడ్‌లో హరితహారం కింద నాటిన మొక్కలను ఆదివారం ఆయన పరిశీలించి వాటికి ట్రీగార్డులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అలాగే పట్టణంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ ఆవుల వెంకన్న, అజయ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రాజు, మున్సిపల్‌ మేనేజర్‌ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

అదనపు గదుల నిర్మాణానికి భూమిపూజ

పట్టణంలోని భుక్తాపూర్‌ కాలనీ హనుమాన్‌ ఆలయంలో అదనపు గదుల నిర్మాణానికి మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీవాసులు సమష్టిగా అదనపు గదుల నిర్మాణానికి నిధులు సమకూర్చడం అభినందనీయమన్నారు. పట్టణంలోని పురాతన ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ బండారి సతీశ్‌, అజయ్‌, గణేశ్‌ పాల్గొన్నారు.

దసరా మైదానం పరిశీలన

దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకునే దస్నాపూర్‌లోని మైదానాన్ని మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ పరిశీలించారు. ఈ నెల 23లోపు మైదానం పరిసరాలను శుభ్రం చేయిస్తామని తెలిపారు. ఆయన వెంట కౌన్సిలర్లు భరత్‌, జాదవ్‌ పవన్‌నాయక్‌, నాయకులు దమ్మపాల్‌, రాజు ఉన్నారు.


logo