గురువారం 22 అక్టోబర్ 2020
Adilabad - Oct 18, 2020 , 02:43:29

అడవుల రక్షణతోనే మానవుల మనుగడ

అడవుల రక్షణతోనే మానవుల మనుగడ

ఆదిలాబాద్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ వినోద్‌కుమార్‌

సిర్పూర్‌(టీ) రేంజ్‌లో పర్యటన 

సిర్పూర్‌(టీ): అడవుల రక్షణతోనే మానవుల మనుగడ ఆధారపడి ఉందని ఉమ్మడి ఆదిలాబాద్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ సీపీ వినోద్‌కుమార్‌ అన్నారు. సిర్పూర్‌(టీ) అటవీ శాఖ రేంజ్‌ పరిధిలోని చీలపల్లి, ఇటుకలపాడు అటవీ ప్రాంతాన్ని జిల్లా అటవీ శాఖ అధికారులతో కలిసి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అడవుల రక్షణ మనందరి బాధ్యత అన్నారు. అడవితో పాటు వన్యప్రాణుల రక్షణకు ప్రతి ఒక్కరూ ఫారెస్ట్‌ అధికారులకు సహకరించాలని కోరారు. ఆనంతరం అటవీ ప్రాంతాలను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట జిల్లా అటవీ శాఖ అధికారి శాంతారం, కాగజ్‌నగర్‌ డీఎఫ్‌వో విజయ్‌కుమార్‌, సిర్పూర్‌(టీ) రేంజ్‌ అధికారి పూర్ణచందర్‌ రావు, మాలిని, ఇటుకలపాడు సెక్షన్‌ అధికారులు, బీట్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 


logo