శుక్రవారం 04 డిసెంబర్ 2020
Adilabad - Oct 15, 2020 , 02:02:33

మాజీ ఎమ్మెల్యేకు కన్నీటి వీడ్కోలు

మాజీ ఎమ్మెల్యేకు కన్నీటి వీడ్కోలు

  • n ముగిసిన గుండా మల్లేశ్‌ అంత్యక్రియలు
  • n పలువురు ప్రముఖుల నివాళి
  • n దహనసంస్కారాలు నిర్వహించిన మనువడు రితీశ్‌

బెల్లంపల్లి టౌన్‌ : బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే, సీ పీఐ మాజీ శాసనసభా పక్షనేత గుండా మల్లేశ్‌ అంత్యక్రియలు బెల్లంపల్లిలో బుధవారం ముగిశాయి. కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులతో బా ధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్‌ దవాఖానలో మంగళవారం మధ్యాహ్నం మృతి చెందాడు. కా గా, తొలుత కార్యకర్తల సందర్శనార్థం హైదరాబాద్‌లోని మగ్ధుం భవన్‌కు భౌతికకాయాన్ని తరలించారు. అక్కడి నుంచి నేరుగా బెల్లంపల్లి పట్టణానికి మంగళవారం రాత్రి తీసుకువచ్చారు. చౌ డేశ్వరి ఏరియాలోని సింగరేణి ఏ క్లాస్‌ క్వార్టర్స్‌కు తరలించి, పార్టీ శ్రేణులు, అభిమానుల సందర్శనార్థం ఉంచారు. తెల్లవారుజాము నుంచే నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయన కడసారి చూపుకోసం తరలివచ్చారు. అనంతరం వైకుంఠరథం ద్వారా ఏఎంసీ, మార్కెట్‌ ఏరియా, బజార్‌ ఏరియా వరకు అంతిమయాత్ర నిర్వహించారు. అక్కడి నుంచి సీపీఐ కార్యాలయం వద్దకు చేరుకుంది. అనంతరం పోచమ్మ చెరువు వద్ద దహనసంస్కారాలు నిర్వహించారు. కుమారుడు ప్రవీణ్‌కుమార్‌ విదేశాల్లో ఉండడంతో మనువడు రితీశ్‌తో అంత్యక్రియలు జరిపించారు.

నివాళులర్పించిన ఎమ్మెల్యే చిన్నయ్య..

గుండా మల్లేశ్‌ భౌతికకాయానికి బెల్లంపల్లి ఎమ్యెల్యే దుర్గం చిన్నయ్య పూలమాల వేసి, నివాళులర్పించారు. కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, మంచిర్యాల జడ్పీ వైస్‌ చైర్మన్‌ తొంగల సత్యనారాయణ, ఏఐటీయూసీ నాయకులు ఎర్రొళ్ల గట్టయ్య, ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి కలవేణి శంకర్‌ పూలమాలలు వేసి, నివాళులర్పించారు.

గుండా మల్లేశ్‌ సేవలు మరువలేనివి..

ఆసిఫాబాద్‌ : గుండా మల్లేశ్‌ సేవలు మరువలేనివని కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి అన్నారు. బెల్లంపల్లిలో జరిగిన అంతిమయాత్రలో ఆమె పాల్గొన్నారు. ఆయన భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్‌రావు పాల్గొన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, పలు రాజకీయ పార్టీల నాయకులు, సంఘాల నాయకులు నివాళులర్పించారు.