శనివారం 05 డిసెంబర్ 2020
Adilabad - Oct 05, 2020 , 01:46:09

బాసరలో ఆర్జిత సేవలు ప్రారంభం

బాసరలో ఆర్జిత సేవలు ప్రారంభం

చిన్నారులకు అక్షరాభ్యాస పూజలు చేసిన అర్చకులు

కరోనా నిబంధనలు పాటించాల్సిందే..ఈవో వినోద్‌రెడ్డి

బాసర : బాసర సరస్వతీ అమ్మవారి ఆల యంలో ఆర్జిత సేవలు ప్రారంభమయ్యా యి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆలయంలో అక్షరాభ్యాసం, కుంకుమార్చన, సత్యనా రా యణ వ్రత పూజలను ఆదివారం ప్రారం భించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చి 20 నుంచి జూన్‌ 7 వరకు ఆలయాలను మూసివేశారు. జూన్‌ 8 నుంచి భక్తులకు దర్శన సౌకర్యం మాత్రమే కల్పించారు.   అందులో కూడా నిబంధనల ప్రకారం ప దేండ్ల లోపు, 60 ఏండ్ల పైబడిన వారికి దర్శ నానికి అనుమతించలేదు. దీంట్లో దాదాపు మూడున్నర నెలల పాటు ఆర్జిత సేవలు లేక భక్తుల సంఖ్య కూడా తగ్గింది.  ప్రభుత్వ నిర్ణయం అనంతరం నిత్యన్నదాన సత్రం, భక్తులకు వసతి గృహాలను ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. అక్షరాభ్యాస పూజ లు ప్రారంభించడంతో భక్తులు సైతం ఆనందా న్ని వ్యక్తం చేస్తున్నారు. 

అన్ని ఏర్పాట్లు చేశాం.. ఈవో వినోద్‌రెడ్డి

ఆలయంలో ఆర్జిత సేవలను ప్రారంభిం చాం.  ఎప్పటికప్పుడు ఆలయ పరిసరాలను శానిటైజేషన్‌ చేస్తున్నాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కరోనా దృష్ట్యా సిబ్బందికి, అర్చకులకు సలహాలు, సూచనలు చేశాం. ఈ నెల 17 నుంచి 25 వరకు నవరాత్రి ఉత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నాం.