ఆదివారం 01 నవంబర్ 2020
Adilabad - Sep 28, 2020 , 02:34:29

పంట కొనుగోళ్లకు పక్కా ప్రణాళిక

పంట కొనుగోళ్లకు పక్కా ప్రణాళిక

పత్తి కొనుగోళ్లకు సమయం ఆసన్నమైంది. ఇంకా నెల రోజుల్లో పత్తి చేతికిరానుండడంతో అధికారులు ముందస్తుగా ఏర్పాట్లు చేస్తున్నారు. రైతులు అవస్థలు పడకుండా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. గ్రామాలవారీగా రైతుల వివరాలు సేకరించి, టోకెన్లు జారీ చేస్తున్నారు. మార్కెటింగ్‌, వ్యవసాయశాఖ, రవాణా, ఫైర్‌, లీగల్‌ మెట్రాలజీ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సీఎం కేసీఆర్‌ సూచించిన విధంగా నియంత్రిత సాగు విధానంతో పత్తి గతేడాది కంటే అధికంగా సాగైంది. ఈ మేరకు పత్తి నిల్వలకు అవసరమైన గోదాములను కూడా సిద్ధం చేస్తున్నారు. -  కుమ్రం భీం ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ

కుమ్రం భీం ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ: ఈ యేడాది ప్రభుత్వం నియంత్రిత సాగు అవలంబించింది. ఇందులో భాగంగా జిల్లా లో సుమారు 4లక్షల 50వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతున్నాయి. అత్యధికం గా 3లక్షల 40వేల ఎకరాల్లో పత్తి సాగవుతున్నది. నెల రోజుల్లో పత్తి సేకరణ కూడా ప్రారం భం కానుంది. అమ్మకం కోసం రైతులకు ఎ లాంటి ఇబ్బంది కలుగకుండా అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఈ ఏ డాది పత్తి 13 - 15 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్న అధికారులు కొ నుగోళ్లు చేపట్టేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 

గ్రామాల వారీగా టోకెన్లు

పంట అమ్మకం సమయంలో రైతుల ఇ బ్బందులను దృష్టిలో పెట్టుకున్న అధికారులు వాటికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నా రు. దిగుబడిపై క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ కచ్చితమైన అంచనా వేస్తున్నారు. గ్రామాల వారీ గా రైతుల వివరాలు సేకరించి టోకెన్లు అందజేస్తారు. వాటికి కేటాయించిన రోజులోనే పంట అమ్ముకునేందుకు కేంద్రానికి రావాల్సి ఉంటుంది. కొనుగోలు కేంద్రాల వద్ద కూడా ఇబ్బందులు తొలిగిపోతాయి. 

అన్ని రకాల జాగ్రత్తలు

మార్కెటింగ్‌, వ్యవసాయ శాఖ, రవాణా, ఫైర్‌, లీగల్‌ మెట్రాలజీ అధికారులతోపాటు జిన్నింగ్‌ మిల్లుల యజమానులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పంట కొనుగో లుకు ముందే జిల్లాలో ఉన్న 15 జిన్నింగ్‌ మి ల్లులను అధికారులు తనిఖీ చేస్తారు. లీగల్‌ మె ట్రాలజీ విభాగం వారు ఎలక్ట్రానిక్‌ కాటాలే, వేబ్రిడ్జీలను పరిశీలిస్తారు. అన్ని నిబంధనలకు           లోబడి ఉంటేనే కొనుగోలుకు అనుమతిస్తారు. ఫైర్‌ అధికారులు సందర్శించి సేఫ్టీని పరిశీలిస్తారు. పత్తి నిల్వలకు అవసరమైన గోదాంలను ఏర్పాటు చేస్తారు. 

దిగుబడిపై భారీ అంచనాలు

ఈ ఏడాది సాగు విస్తీర్ణం పెరిగిన దృష్ట్యా దిగుబడిపై అధికారులు భారీ అంచనా వేస్తున్నారు. గతేడాది దాదాపు 11 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి రాగా ఈ ఏడాది అనుకూలమైన వర్షాలు పడడంతో 15లక్షల  క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని భావిస్తున్నారు.