మంగళవారం 27 అక్టోబర్ 2020
Adilabad - Sep 25, 2020 , 02:28:18

అధిక దిగుబడులకు సలహాలు ఇవ్వాలి

అధిక దిగుబడులకు సలహాలు ఇవ్వాలి

  •   ఆదిలాబాద్‌ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌
  • n  ఏఈవోలకు శిక్షణ తరగతులు 

ఎదులాపురం :  రైతులు అధిక దిగుబడులు సాధించేలా సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆదిలాబాద్‌ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు.  జిల్లా కేం ద్రంలోని టీటీడీసీలో వ్యవసాయ విస్తరణ అధికారులకు గురువారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సరైన సమయంలో రైతులు కీటకాల నివారణకు చర్య లు తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో 101 క్లస్టర్లలో నిర్మిస్తున్న రైతువేదికలను వచ్చేనెల 10 లోగా పూర్తయ్యేలా చూడాలన్నారు. ఈ నెల 30లోగా బేస్‌మెంట్‌ స్థాయి వరకు నిర్మాణాలు జరగకుంటే సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించా రు. అనంతరం జిల్లా వ్యవసాయ అధికారి వెంక టి మాట్లాడుతూ ఈ యేడు పత్తి పంట ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్ల వరకు వచ్చే అవకాశం ఉందన్నారు. రైతుబంధు, రైతుబీమా అర్హులకే అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. క ల్లాల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. అంతకుముందు శాస్త్రవేత్త కే. రాజశేఖర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా పత్తి, సోయా పంటల్లో కీటకాల నివారణకు వినియోగించే మందులు వివరించారు. సమావేశంలో శాస్త్రవేత్తలు, ఏఈవోలు ఉన్నారు.


logo