బుధవారం 28 అక్టోబర్ 2020
Adilabad - Sep 25, 2020 , 02:28:19

భూమి పుత్రుడికి మద్దతుగా..

భూమి పుత్రుడికి మద్దతుగా..

  • n  ఇచ్చోడలో ట్రాక్టర్లు, బైక్‌లతో   రైతులు, నాయకులు, కార్యకర్తల  ర్యాలీ
  • n  సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం
  • n  నేడు బోథ్‌లో సంఘీభావ ర్యాలీ

ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ/ఇచ్చోడ :  తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్టానికి సర్వత్రా మద్దతు లభిస్తున్నది. భూ సమస్యల పరిష్కారం కోసం ఈ చట్టం తమకు ఎంతో మేలు చేస్తుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉంటే గురువారం ఇచ్చోడ మండలంలోని గుబ్బా గ్రామం నుంచి ఇచ్చోడలోని సిరిచెల్మ చౌరస్తా వరకు స్థానిక నాయకులు, రైతులు, ప్రజలు ట్రాక్టర్లు, బైక్‌లతో భారీ ర్యాలీ తీశారు. అనంతరం పొలంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతు లు, ప్రజలు భారీగా  హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇచ్చోడ ఎంపీపీ నిమ్మల ప్రీతమ్‌రెడ్డి మాట్లాడుతూ పూర్తిగా బూజు పట్టిన రెవెన్యూ చట్టానికి మోక్షం కల్పించి సీఎం కేసీఆర్‌ రైతు బాంధవుడిగా నిలిచాడని కొనియాడారు. ఇక నుంచి కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సిన పని లేదన్నారు.  స్థానిక మండల కన్వీనర్‌ పాట్కూరి శ్రీనివాస్‌ రెడ్డి, ఇచ్చోడ డివిజన్‌ ఆత్మ చైర్మన్‌ నరాల రవీందర్‌, సోషల్‌ మీడియా కన్వీనర్‌ దాసరి భాస్కర్‌, ఏనుగు కృష్ణారెడ్డి, నర్వాడే రమేశ్‌, రాథోడ్‌ ప్ర వీణ్‌ కుమార్‌, అబ్దుల్‌ రషీద్‌, రాథోడ్‌ ప్రకాశ్‌, బద్దం పురుషోత్తం రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. 

నేడు బోథ్‌లో ర్యాలీ

కొత్త రెవెన్యూ చట్టానికి మద్దతుగా శుక్రవారం బోథ్‌లో సంఘీభావ ర్యాలీ నిర్వహించనున్నారు. నియోజకవర్గం నుంచి రైతు లు, స్థానిక నాయకులు, తమ గ్రామాల నుంచి ఎడ్లబండ్లు, ట్రా క్టర్ల్ల ద్వారా హాజరుకానున్నారు. బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు, రైతు సంఘాల నాయకులు, రైతులు, ప్రజలు  మద్దతు తెలుపనున్నారు.


logo