మంగళవారం 20 అక్టోబర్ 2020
Adilabad - Sep 23, 2020 , 01:56:42

పనులు పూర్తి చేయించండి

పనులు పూర్తి చేయించండి

  • మంత్రి అల్లోలకు ఆదిలాబాద్‌ మాజీ ఎంపీ నగేశ్‌ విజ్ఞప్తి

ఆదిలాబాద్‌ రూరల్‌ : జిల్లాలో గతంలో మం జూరైన పలు దేవాలయాల అభివృద్ధి పనులను పూర్తిచేయించాలని ఆదిలాబాద్‌ మాజీ ఎంపీ నగేశ్‌ కోరారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో మంగళవారం రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డిని కలిసి, విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కెస్లాపూర్‌, సిరిచెల్మ, కప్పర్ల, బజార్‌హత్నూర్‌, జాతర్లలోని ఆలయాలకు నిధులు మంజూరయ్యాయని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. టెండర్లు పిలిచి, పనులు ప్రారంభమయ్యేలా చూడాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బాలూరి గోవర్ధన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


logo