బుధవారం 02 డిసెంబర్ 2020
Adilabad - Sep 23, 2020 , 01:56:49

వీధివ్యాపారులకు రుణాలివ్వాలి

వీధివ్యాపారులకు రుణాలివ్వాలి

  • వీసీలో నోడల్‌ అధికారి జయలక్ష్మి

ఎదులాపురం : పట్టణ పరిధిలోని అర్హత మేరకు, జనాభా ప్రాతిపదికన 5 శాతం వీధి వ్యాపారులను గుర్తించి ఆత్మనిర్భర్‌ అభియాన్‌ రుణాలు అందించాలని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాంట్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ నోడల్‌ అధికారి జయలక్ష్మి పేర్కొన్నారు. కలెక్టర్‌, మున్సిపల్‌ కమిషనర్‌, ఎల్‌డీఎంలతో మంగళవారం హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గుర్తించిన వ్యాపారులకు 100 శాతం మేర రుణాలు అందేలా బ్యాంకర్లను సమన్వయం చేస్తూ గ్రౌండింగ్‌ చేయాలన్నారు. అనంతరం కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ మాట్లాడుతూ.. ఆదిలాబాద్‌ పట్టణ జనాభా 1,55,747 కాగా, 5 శాతం మందిని గుర్తించినట్లు, గుర్తింపు కార్డులను జారీ చేసినట్లు చెప్పారు. ఇప్పటి వరకు 1853 మందికి రుణాలు మంజూరుచేసినట్లు వెల్లడించారు. మిగతా దరఖాస్తులను త్వరలోనే ఆయా బ్యాంకులకు పంపించి, రుణాల మంజూరుకు చర్యలు తీసుకుంటామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో మున్సిపల్‌ కమిషనర్‌ రాజేశ్వర్‌ రాథోడ్‌, ఎస్‌బీఐ బ్రాంచ్‌ మేనేజర్‌ ఆనంద్‌, మెప్మా డీఎంసీ సుభాష్‌ తదితరులు ఉన్నారు.