శనివారం 31 అక్టోబర్ 2020
Adilabad - Sep 18, 2020 , 00:58:49

రైత‌న్న ఇంట బంగారు పంట‌

రైత‌న్న ఇంట బంగారు పంట‌

  • ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఏపుగా పెరిగిన పత్తి 
  • ఏపుగా పెరిగిన పత్తి పంట 
  • ఫలించిన నియంత్రిత సాగు విధానం 
  • సీఎం పిలుపుతో మొగ్గు చూపిన రైతులు
  • అంచనాకు మించి దిగుబడి వచ్చే అవకాశం 
  • కొనుగోళ్లకు అధికారుల ఏర్పాట్లు 

నల్లరేగడి నేలలో తెల్ల బంగారం విరగకాసింది. పత్తి కాయలు  గుత్తులు గుత్తులుగా కనిపిస్తున్నాయి. రైతుల ఇంట సిరుల పంట పండనున్నది. సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు రైతులందరూ నియంత్రిత సాగు వైపు మొగ్గు చూపారు. వానలు సకాలంలో కురవడం, తెలంగాణ సర్కారు విత్తనాలు, ఎరువులు సక్రమంగా అందించడం, వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి సూచనలు, సలహాలు ఇవ్వడం,

వీటిని పాటించడంతో పత్తి అంచనాకు మించి దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సీసీఐ ఆధ్వర్యంలో పంటను సేకరించనుండగా.. అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్కెట్‌ యార్డులతోపాటు నేరుగా జిన్నింగ్‌ ఫ్యాక్టరీల్లో పత్తిని కొనుగోలు చేయనున్నారు. ప్రభుత్వం ఈ సారి క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ.5,825 ప్రకటించగా.. రైతుకు ఈ ధర లభించేలా అధికారులు 52 కేంద్రాల్లో సేకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు.          

 - ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణపత్తి చేనులో నిలబడి ఉన్న ఈ రైతు పేరు మలపతి మల్లయ్య. ఈయనది తాంసి మండలం పొన్నారి గ్రామం. సీఎం సారు చెప్పినట్టుగా గ్రామ శివారుల్లోని తన ఐదెకరాల భూమిలో పత్తి వేశాడు. సాగుకు అన్ని పరిస్థితులు అనుకూలిం చడంతో ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. పత్తితోపాటు అన్ని పంటలు మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని సర్కారు ప్రకటించింది. దీంతో దాదాపు రూ.60వేలు వస్తాయని మల్లయ్య ఆనందంగా తెలిపాడు.  ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ : ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లావ్యాప్తంగా ఈ యేడాది పత్తి సాగు విస్తీర్ణం పెరిగింది. సీఎం కేసీఆర్‌ నియంత్రిత పద్ధతిలో సాగు చేయాలని పిలుపు నివ్వడంతో రైతులు పత్తి వైపు మొగ్గు చూపారు. దీనికితోడు వాతావరణం అనుకూలించడం, సకాలంలో వర్షాలు కురవడం, సర్కారు కొరత లేకుండా విత్తనాలు, ఎరువులు అందించడం, వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బంది గ్రామాల్లో పర్యటిస్తూ సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రస్తుతం పత్తి ఏపుగా పెరిగి కాయదశలో ఉంది. అన్ని అనుకూలించడంతో పంట దిగుబడి ఎకరానికి ఎనిమిది నుంచి పది క్వింటాళ్ల వరకు వచ్చే అవకాశాలున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లావ్యాప్తంగా ఈ యేడాది 10.15 లక్షల ఎకరాల్లో పత్తి సాగవగా 88 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు 52 కొనుగోలు కేంద్రాల్లో పత్తి పంటను సేకరించనున్నారు. మార్కెట్‌ యార్డులతోపాటు జిన్నింగ్‌మిల్లుల్లో పంటను సేకరిస్తారు. ఆదిలాబాద్‌ జిల్లాలో పది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా.. ఆదిలాబాద్‌ మార్కెట్‌ యార్డుతోపాటు పాత మార్కెట్‌యార్డులో పత్తిని సేకరించనున్నారు. బోథ్‌, పొచ్చెర, సొనాల, ఇచ్చోడ, నేరడిగొండ, ఇంద్రవెల్లి, నార్నూర్‌, బేల జిన్నింగ్‌ మిల్లుల్లో కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. నిర్మల్‌ జిల్లాలో కూడా నిర్మల్‌, సారంగాపూర్‌, భైంసా మండలాల్లో కొనుగోలు చేయనున్నారు. 

సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోళ్లు

ప్రభుత్వం ఈ యేడాది పత్తి క్వింటాలుకు కనీస మద్దతు ధర మధ్య రకానికి రూ.5,515,  పొడవాటి రకానికి రూ.5,825 ప్రకటించింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో సీసీఐ ఆధ్వర్యంలో పత్తిని సేకరించనున్నారు. ప్రస్తుతం పంట కాయదశలో ఉండగా.. అక్టోబర్‌ రెండో వారంలో కొనుగోళ్లు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఇందులో భాగంగా అధికారులు జిన్నింగ్‌లలో పంట కొనుగోళ్లలో భాగంగా అవసరమైన సిబ్బందిని నియమిస్తారు. ప్రభుత్వం ప్రకటించిన మద్ద తు ధర కంటే బహిరంగ మార్కెట్‌లో ఎక్కువ ధర ఉంటే రైతులు ప్రైవేట్‌ వ్యాపారులకు పత్తిని అమ్ముకునే అవకాశం ఉంది. వ్యాపారులు పంటలో తేమ శాతం ఎక్కువగా ఉందనే సాకుతో మద్ద తు ధర చెల్లించని పక్షంలో సీసీఐ అధికారులు రైతులు వద్ద నుంచి పంటను కొనుగోలు చేస్తారు. కరోనా నేపథ్యంలో  పంట కొనుగోళ్ల లో అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. 

అక్టోబర్‌ రెండో వారంలో కొనుగోళ్లు


ఈ సీజన్‌లో రైతులు సాగు చేస్తున్న పత్తి పంట కొనుగోలుకు ప్రణా ళికలు తయారు చేస్తున్నాం. సీసీఐ ఆధ్వర్యంలో పంటను సేకరించనున్నాం. అక్టోబర్‌ రెండో వారంలో కొనుగోళ్లు ప్రారంభమయ్యే అవకాశాలు న్నాయి. ఆయా మార్కెట్‌ యార్డుల పరిధిలోని రైతులకు ఏ రోజు పత్తి తీసుకురావాలనే వివరాలు ముందుగానే తెలియజేస్తాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా, కొవి డ్‌-19 నిబంధనలు పాటిస్తూ కొనుగోళ్లు చేపడుతాం.

- అశ్వాక్‌, జిల్లా మార్కెటింగ్‌ అధికారి, ఆదిలాబాద్‌

నియంత్రిత సాగు బాగున్నది.. 


తెలంగాణ ప్రభుత్వం ఏఏ పంటలు పండించాలో ముందే చెప్పంది. ప్రభుత్వం, అధికారులు చెప్పిన ట్లుగానే పత్తి వేసిన. పత్తి ఇప్పు డైతే మంచిగున్నది. మంచి దిగుబడి వస్తుందనుకుంటున్న. పత్తికి మద్దతు ధర క్వింటాలుకు రూ.5,825 ఉంది. పొయినేడు పత్తిని సీసీఐ కొనుగోలు చేసింది. ఈ యేడాది కూడా సీసీఐ కొంటుందని సర్కా రు చెప్పడం సంతోషంగా ఉంది. మేము పండించిన పత్తికి పూర్తి ధర లభిస్తున్నది. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు జరుగుతున్నాయి. ప్రభుత్వం చెప్పిన నియంత్రిత సాగు బాగున్నది.

- చంద్రన్న, రైతు, పొన్నారి, తాంసి మండలం