మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Adilabad - Sep 16, 2020 , 03:10:25

రైతు వేదికలను దసరాలోగా పూర్తి చేయాలి

రైతు వేదికలను దసరాలోగా పూర్తి చేయాలి

  • ఆదిలాబాద్‌ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

ఆదిలాబాద్‌  రూరల్‌:  రైతు వేదికల నిర్మాణాలను దసరా పండుగ లోగా పూర్తి చేయాలని ఆదిలాబాద్‌ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌  అన్నారు. మండలంలోని  యాపల్‌గూడలో చేపట్టిన రైతు వేదిక నిర్మాణాన్ని కలెక్టర్‌ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకోసం ప్రత్యేకంగా రైతు వేదికలు నిర్మిస్తున్నదని చెప్పారు. సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పించేందుకు రైతు వేదికలు ఏర్పాటు చేస్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో మండల వైస్‌ ప్రెసిడెంట్‌ రమేశ్‌, జగదీశ్వర్‌, నల్ల రాజేశ్వర్‌ పాల్గొన్నారు.

ఇంద్రవెల్లి : మండలంలో చేపట్టిన రైతు వేదికల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి అన్నారు. ఇంద్రవెల్లి, మెండపల్లిలో నిర్మిస్తున్న రైతు వేదికల నిర్మాణాలను  అధికారులతో కలిసి మంగళవారం ఆమె పరిశీలించారు. నిర్మాణంలో నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. నిర్మాణంలో ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని సూచించారు. సంబంధిత శాఖ అధికారులు దగ్గరుండి పనులు పర్యవేక్షించాలన్నారు. ఆమె వెంట తహసీల్దార్‌ రాఘవేంద్రరావు, గిర్దావర్‌, మెస్రం లక్ష్మణ్‌, పీఆర్‌ ఏఈ రమేశ్‌, ఎంపీవో సంతోష్‌, సర్పంచ్‌లు కోరెంగా గాంధారి, కుసుమబాయి, ఏపీవో సంతోష్‌జైస్వాల్‌, ఈసీ జాదవ్‌ శ్రీనివాస్‌, నాయకులు దేవ్‌పూజే మారుతి, కోరెం గా సుంకట్‌రావు, దశరథ్‌ పటేల్‌ పాల్గొన్నారు.


logo