బిగ్ బాస్ ఫేం, ప్రముఖ యాంకర్ శ్యామల భర్త నరసింహా రెడ్డి రెండు రోజుల క్రితం అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. సింధూరా రెడ్డి అనే మహిళ దగ్గర కోటి రూపాయలు అప్పుగా తీసుకొని చీటింగ్ చేసిన కేసులో రాయదుర్గం పోలీసులు నరసింహా రెడ్డిని అరెస్ట్ చేశారు. తాజాగా బెయిల్పై బయటకు వచ్చిన ఆయన ఓ వీడియో ద్వారా తన ఆవేదన తెలియజేశాడు. ఈ వీడియోను శ్యామల తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ.. నిజం త్వరలోనే బయటకు వస్తుంది. ఈ సమయంలో మాకు అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు అని పేర్కొంది.
రీసెంట్గా నాపై సోషల్ మీడియాలో చాలా కథనాలు వచ్చాయి. అయినప్పటికీ తప్పుడు ఆరోపణలు నమ్మకుండా అండగా నిలిచినందుకు ధన్యవాదాలు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు, ఎలా తప్పుదోవ పట్టించారు అనే వివరాలు, ఆధారాలతో త్వరలోనే మీ ముందుకు వస్తాను. కొన్ని సార్లు నిందలు మోయాలి, పుకార్లపై స్పందించాల్సి ఉంటుంది. రెండు రోజులలోనే బయటకు రావడం అనేది తప్పుడు కేసు అనడానికి నిరూపణ అంటూ నరసింహా రెడ్డి వీడియోలో పేర్కొన్నారు.
ఇవికూడా చదవండి