శనివారం 05 డిసెంబర్ 2020
Adilabad - Aug 15, 2020 , 23:57:58

జిల్లావ్యాప్తంగా 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

జిల్లావ్యాప్తంగా 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

  • n జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లలో జెండా ఎగురవేసిన ముఖ్య అతిథులు
  • n నిర్మల్‌లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఆదిలాబాద్‌లో శాసనమండలి విప్‌ కర్నె ప్రభాకర్‌
  • n పాల్గొన్న కలెక్టర్లు ముషారఫ్‌ అలీ ఫారూఖీ, సిక్తాపట్నాయక్‌
  • n ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో జాతీయ పతాకాలు ఆవిష్కరించిన ఎమ్మెల్యేలు జోగు రామన్న, విఠల్‌రెడ్డి, రేఖానాయక్‌
  • n నిర్మల్‌లో 150 ఫీట్ల ఎత్తైన జాతీయ జెండా ఆవిష్కరించిన అమాత్యుడు
  • n తరలివచ్చిన పట్టణ ప్రజలు, సెల్ఫీలతో సంతోషం

74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లా వ్యాప్తంగా శనివారం నిరాడంబరంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ, వేడుకలు నిర్వహించారు. నిర్మల్‌ కలెక్టరేట్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌లో శాసన మండలి చైర్మన్‌ కర్నె ప్రభాకర్‌ జాతీయ జెండా ఎగురవేశారు. నిర్మల్‌లో భారీ జాతీయ జెండాను మంత్రి ఆవిష్కరించారు.

ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ/ఎదులాపురం: ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా పంద్రాగస్టు వేడుకలు శనివారం నిరాడంబరంగా నిర్వహించారు. కలెక్టరేట్‌ ఆవరణలో నిర్వహించిన వేడుకలకు ప్రభుత్వ విప్‌ కర్నె ప్రభాకర్‌ హాజరై జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ జనార్దన్‌ రాథోడ్‌, ఆదిలాబాద్‌, బోథ్‌ ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్‌ బాపురావు,  డీసీసీబీ చైర్మన్‌ నాందేవ్‌, కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, ఎస్పీ విష్టు వారియర్‌ , మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌, వివిధ శాఖల అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అనంతరం కలెక్టర్‌ సమావేశం మందిరంలో జరిగిన తేనేటి విందు కార్యక్రమంలో విప్‌ కర్నె ప్రభాకర్‌, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విప్‌ ప్ర భాకర్‌ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. కరోనా నేపథ్యంలో ఇబ్బందులు వచ్చినా అందరి సహకారంతో జీవనం సాఫీగా సాగేలా ప్రభుత్వం చర్యలు తీ సుకుంటున్నదన్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో సీజనల్‌ వ్యాధులతో ప్రజలు గతంలో  ఇబ్బందులు పడేవారని,   తెలంగాణ సర్కారు వ చ్చాక పూర్తి వైద్య సేవలు కల్పిస్తున్నదన్నారు. 

రెపరెపలాడిన త్రివర్ణ పతాకం

74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జిల్లాలో శనివారం ఘనంగా నిర్వహించా రు. త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. కలెక్టర్‌ బంగ్లాలో జాతీయ జెండాను కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ ఎగురవేశారు. ముందుగా పోలీస్‌ల గౌరవ వందనాన్ని స్వీకరించారు.  జిల్లా  కోర్టులో ప్రధాన న్యాయమూర్తి  ఎంజీ ప్రియదర్శిని జాతీయ జెండాను ఆవిష్కరించారు. న్యాయమూర్తులు కంచ ప్రసాద్‌, శ్రీనివాస్‌రావు, ఉదయభాస్కర్‌, అరుణకుమారి, బార్‌ అసోసియేషన్‌ జి ల్లా అధ్యక్షుడు మోహన్‌ సింగ్‌, న్యాయవాదులు, మధూకర్‌, పీపీ ఎం. రమణారెడ్డి పాల్గొన్నారు. జడ్పీ కార్యాలయ ఆవరణలో జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌ జాతీయ జెండా ఎగుర వేయగా, ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్‌ నాందేవ్‌ కాంబ్లే, జడ్పీ సీఈవో కిషన్‌ ఉన్నారు. జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయంలో డీఎంహెచ్‌వో నరేందర్‌ రాథోడ్‌ జెండా ఎగుర వేయగా డిప్యూటీ డీఎంహెచ్‌వో సాధన, అడిషనల్‌ డీఎంహెచ్‌వో శ్రీకాంత్‌, డీఎంవో శ్రీధర్‌, కార్యాలయ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. జిల్లా పరిశ్రమల శాఖ కార్యాలయంలో జీఎం రాంకిషన్‌ నాయక్‌, యాపల్‌గూడలోని రెండో బెటాలియన్‌లో కమాండెంట్‌ ఆర్‌ వేణుగోపాల్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమాండెంట్లు డీవీ నరసింహ రాజు, కే అప్పారావు, కేవీవీ ప్రసాద్‌, సీఐలు ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు ఉన్నారు. మావల తహసీల్‌ కార్యాలయం లో తహసీల్దార్‌ వనజారెడ్డి, జాతీయ జెండాను ఎగురవేసి  జాతీ య గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో రవి, సిబ్బం ది సాయి, తదితరులున్నారు. ఐసీడీఎస్‌ కార్యాలయంలో పీడీ మి ల్కా జాతీయ జెండాను ఆవిష్కరించారు. బీసీ కార్యాలయంలో బీసీ అభివృద్ధి శాఖ అధికారి ఆశన్న జాతీయ జెండాను ఎగురవేశా రు. ఉట్నూర్‌ ఐటీడీఏ  కార్యాలయంలో పీవో భావేశ్‌ మిశ్రా జెండా ఆవిష్కరించారు.

నిర్మల్‌, నమస్తే తెలంగాణ/ నిర్మల్‌ అర్బన్‌: నిర్మల్‌ జిల్లా వ్యా ప్తంగా 74వ స్వాత్రంత్య దినోత్సవ వేడుకలు ఘనంగా ని ర్వహించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో నిర్వహించి న వేడుకల్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొని జెం డా ఎగురవేశారు. కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ, జిల్లా  అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మంత్రి క్యాంపు కార్యాలయంలోనూ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి జాతీ య జెండా ఎగురవేశారు. రాష్ట్రంలో అత్యంత ఎత్తైన 150 ఫీట్ల రెండో జాతీయ జెండాను నిర్మల్‌ పట్టణంలోని మినీ ట్యాంక్‌ బండ్‌ వద్ద మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి శనివారం ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలో అతి పెద్ద జెండా ఆవిష్కరిస్తున్న విషయం తెలుసుకున్న పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కొవిడ్‌-19 నిబంధనలు పాటి స్తూ భౌతిక దూరంతో జాతీయ జెండాను ఆవిష్కరిస్తుండగా, సెల్‌ ఫోన్‌లో ఫొటోలు, వీడియోలు తీసి భద్ర పరుచుకున్నారు. మరి కొందరు డ్రోన్ల సహాయంతో ఫొటోలు, వీడియోలు తీసి తమ కెమెరాల్లో బంధించారు.  నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో, జిల్లా పోలీస్‌ కార్యాలయంలో, సాయుధ దళ కార్యాలయంలో ఏఎస్పీ రాంరెడ్డి జెండాను ఆవిష్కరించారు. అంతకుముం దు పోలీస్‌ సిబ్బంది గౌరవ వందనం స్వీకరించారు. డీ ఎస్పీ కార్యాలయంలో నిర్మల్‌ డీఎస్పీ ఉపేందర్‌ రెడ్డి, ప ట్టణ పోలీస్‌ స్టేషన్‌లో సీఐ జాన్‌దివాకర్‌ జెండాను ఆవిష్కరించారు. జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో జిల్లా అటవీ శాఖ అధికారి సుదాన్‌, జిల్లా రవాణా శాఖ కార్యాలయం లో డీటీవో అజయ్‌ కుమార్‌ రెడ్డి, ఏరియా దవాఖానలో డాక్టర్‌ దేవేందర్‌ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో డీఎంహెచ్‌వో వసంత్‌ రావు, జిల్లా యువజన క్రీడల శాఖ కార్యాలయంలో ముత్తన్న, జిల్లా గ్రంథాలయ శాఖలో జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ ఎర్రవోతు రాజేందర్‌, అగ్ని మాపక శాఖ కార్యాలయంలో మల్లయ్య జాతీయ జెండాను ఆవిష్కరించగా పట్టణంలోని వివిధ వార్డుల్లో యువజన సంఘాలు, కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేశారు.