ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Adilabad - Aug 14, 2020 , 00:17:23

స్వచ్ఛత వైపు గ్రామాలు

స్వచ్ఛత వైపు గ్రామాలు

  • n నిత్యం పారిశుద్ధ్య పనులు
  • n ఇంటింటికీ చెత్తబుట్టల పంపిణీ 
  • n ప్రతి పంచాయతీకి ట్రాక్టర్‌
  • n డంప్‌యార్డులు, సెగ్రిగేషన్‌ షెడ్లు

నార్నూర్‌ : మండలంలోని గ్రామాలు స్వచ్ఛత వైపు అడుగులు వేస్తున్నాయి.  పల్లెల్లో నిత్యం పారిశుద్ధ్య పనులు చేపడుతూ అ ధికారులు, పంచాయతీ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గతంలో గ్రామాల్లో ఎక్కడ చూసిన చెత్తాచెదారం కనిపించేది. వర్షాకాలంలో మురుగు దుర్వాసన, దోమల బెడదతో ప్రజలు నానా ఇబ్బందులు పడేవారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛతకు ప్రాధాన్యమిస్తున్నాయి. ఇందు లో భాగంగా పారిశుద్ధ్య సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ చెత్త ను సేకరించేందుకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ట్రాలీ, ట్రా క్టర్లను మంజూరు చేసింది. ముందుగా తడి, పొడి చెత్తను వేరు గా వేసేందుకు మహిళలకు చెత్తబుట్టలు పంపిణీ చేసి అవగాహ న కల్పించారు. ఇలా సేకరించిన చెత్తను పారబోసేందుకు నా ర్నూర్‌ మండలంలో 23 గ్రామాల్లో డంప్‌యార్డ్‌లు నిర్మిస్తున్నా రు. 16 సెగ్రిగేషన్‌ షెడ్ల నిర్మాణాలు పూర్తి కాగా, మరో ఏడు షెడ్ల పనులు పురోగతిలో ఉన్నాయి. 

ప్రతి పంచాయతీకి ట్రాక్టర్‌

ప్రతి గ్రామం శుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో ఇంటింటికీ చెత్తబుట్టలు పంపిణీ చేసింది. అంతేగాకుండా చెత్త సేకరణకు ట్రాక్టర్లు అందజేసింది. నిత్యం వీటి ద్వారా చెత్తను సేకరించి డంప్‌యార్డుకు తరలించేలా చర్యలు తీసుకుంటున్నారు. అంతేగాకుండా అధికారులు ఆకస్మిక తనిఖీలు చేసి చెత్తాచెదారం కనిపిస్తే కార్యదర్శి, సర్పంచ్‌లపై చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఇప్పుడు గ్రామాల్లోని వీధులు పరిశుభ్రంగా కనిపిస్తున్నాయి.

పల్లె ప్రగతితో మారిన రూపురేఖలు..

పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. ట్రాక్టర్ల పంపిణీతో పారిశుద్ధ్య సమస్య లేకుండా పోయింది. అంతేగాకుండా నిర్వహణ సక్రమంగా జరుగుతోంది. వీధులన్నీ శుభ్రంగా మారాయి. ఇంటింటికీ పారిశుద్ధ్య సిబ్బంది తిరుగుతూ చెత్తను సేకరిస్తున్నారు.

-మడావి ముక్తాబాయి, సర్పంచ్‌, జామాడ 

వర్మీకంపోస్ట్‌ తయారు చేసేలా చర్యలు..

ప్రతి గ్రామ శివారులో డంప్‌యార్డు నిర్మించాం. తడి, పొడి చెత్తను వేరుగా సేకరించే విధానంపై ఇప్పటికే సిబ్బందికి అవగాహన కల్పించాం. సేకరించిన చెత్తతో వర్మీ కంపోస్టు తయారు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. దీనిని వ్యవసాయానికి ఉపయోగించుకోవాలని చెబుతున్నాం. 

-రమేశ్‌, ఎంపీడీవో, నార్నూర్‌ 


logo