శనివారం 26 సెప్టెంబర్ 2020
Adilabad - Aug 12, 2020 , 02:57:41

ప్రాణాలు కాపాడారు..

ప్రాణాలు కాపాడారు..

  •  ఏరియా దవాఖానలో  మెరుగైన వైద్యం
  • అపస్మారక స్థితిలో ఉన్న  రోగి ప్రాణాలు కాపాడిన వైద్యులు
  • 41రోజులు కష్టపడ్డ ఫలితం 
  • కోలుకోవడంతో డిశ్చార్జి 

నిర్మల్‌ అర్బన్‌ : జిల్లా కేంద్రంలోని ఏరియా దవాఖానలో వైద్యులు మెరుగైన వైద్యంతో రోగి ప్రాణాలను కాపాడినట్లు సూపరిండెంటెంట్‌ దేవేందర్‌రెడ్డి తెలిపారు. సారంగాపూర్‌ మండలానికి చెందిన మహేశ్‌ గత నెల 6న పురుగుల మం దు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడని పేర్కొన్నారు. బాధితుడిని కుటుంబ సభ్యులు ఏరియా దవాఖానలో అడ్మిట్‌ చేశారని చెప్పారు. అప్పటికే అతడికి ఆక్సిజన్‌ లెవల్‌ 20-25 ఉందని, శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా ఉండేదని వివరించారు. పరీక్షించిన వైద్య సిబ్బంది 41 రోజులు కష్టపడి బాధితుడిని సంపూర్ణ ఆరోగ్య వంతుడిని చేసి మంగళవారం డిశ్చార్జి చేశారు. ఈ సందర్భంగా దవాఖాన సూపరింటెండెంట్‌ మాట్లాడుతూ మ హేశ్‌ దవాఖానకు వచ్చే సరికి  గుండె, ఊపిరితిత్తు లు పని చేయడం కష్టంగా ఉండడంతో డాక్టర్‌ రత్నాకర్‌ పరీక్షలు చేశారని తెలిపారు. నోటిద్వారా ఊపిరితిత్తులకు పైపు వేసి కృత్రిమ శ్వాస అందించారని పేర్కొన్నారు. వెంటిలేటర్‌పై 41 రోజులు మైరుగైన వైద్యం అందించి కోలుకునేలా చేశామ ని, కరోనా నేపథ్యంలో దవాఖానలో అన్ని రకాల సేవలను అందిస్తున్నామని, ఓపీ, ఐపీ, సర్జరీ సేవ లు ప్రజలు వినియోగించుకోవాలని సూచించా రు. రోగిని పూర్తి ఆరోగ్యవంతులుగా చేసిన వైద్యులను, సిబ్బందిని అభినందించారు.logo