ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Adilabad - Aug 10, 2020 , 00:08:48

ఘనంగా ఆదివాసీ డే

ఘనంగా ఆదివాసీ డే

  • జెండా ఎగురవేసిన ప్రముఖులు   
  • మహిళల నృత్యాలు   
  • ఆదివాసుల ప్రత్యేక పూజలు

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా పల్లెలు, గూడేల్లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆదివారం ఆదివాసులు ఘనంగా నిర్వహించుకున్నారు. జెండా ఎగురవేశారు. కుమ్రం భీం విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. సంప్రదాయ వాయిద్యాల నడుమ గిరిజన మహిళలు నృత్యం చేశారు. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌లో గల ఆదివాసీ పర్ధాన్‌ సమాజ్‌ సేవా సంఘం కార్యాలయంలో ఎమ్మెల్యే జోగు రామన్న.., స్థానిక ఎస్‌టీయూ భవనంలో కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ జెండా ఎగురవేశారు. అనంతరం బస్టాండ్‌ సమీపంలో హీరా సుక్క, గోండు ధర్మగురు విగ్రహం, చిత్రపటాలకు కలెక్టర్‌, అధికారులు, నాయకులు పూజలు చేశారు.               


logo