శనివారం 05 డిసెంబర్ 2020
Adilabad - Aug 09, 2020 , 01:35:08

మున్సిపాలిటీల్లో ఒకేసారి ఆస్తిపన్ను చెల్లింపునకు అవకాశం

మున్సిపాలిటీల్లో ఒకేసారి ఆస్తిపన్ను చెల్లింపునకు అవకాశం

ప్రభుత్వం బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. పేరుకుపోయిన ఆస్తి(ఇంటి)పన్ను బకాయిలు చెల్లించడానికి ‘వన్‌టైం సెటిల్‌మెంట్‌' పథకాన్ని ప్రవేశపెట్టింది. అంటే ఒకేసారి చెల్లిస్తే పెండింగ్‌లో ఉన్న బకాయిలపై 90 శాతం వడ్డీ రాయితీ కల్పిస్తూ మున్సిపల్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక బల్దియా అధికారులు కరపత్రాలు, ఆటోలు, ఫ్లెక్సీలు, లోకల్‌ చానెళ్ల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్‌ 15 వరకు గడువు ఉందని తెలుపుతున్నారు. అంటే ఇంకా 37 రోజుల సమయం మాత్రమే ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో రూ.2.44 కోట్ల మేర బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. నస్పూర్‌, క్యాతనపల్లి, లక్షెట్టిపేట మున్సిపాలిటీల్లో అధికార యంత్రాంగం వంద శాతం పన్ను వసూలు చేసింది.  - ఆదిలాబాద్‌ రూరల్‌

ఆదిలాబాద్‌ రూరల్‌ : మున్సిపాలిటీల్లో పేరుకుపోయిన బకా యి వసూళ్లకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించిం ది. బకాయి వసూళ్లకోసం ప్రభుత్వానికి ఆదాయం వచ్చేందు కు వన్‌టైం సెటిల్‌మెంట్‌ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇం దులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లోనూ బకాయి ఉన్న పన్నులను ఎవరైనా ఒకేసారి చెల్లి స్తే దానిపై ఉన్న వడ్డీలో 90శాతం వడ్డీని మాఫీ చేస్తున్నారు. దీనిపై జిల్లాలో ఆయా మున్సిపాలిటీల పరిధిలో పేరుకుపోయి న బకాయి వసూళ్లకు మున్సిపల్‌ అధికారులు ప్రజలు, వ్యాపారులకు అవగాహన కల్పిస్తున్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలీటీల్లో రూ.2.44 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఇందులో అత్యధికంగా నిర్మల్‌లో రూ.1.08 కోట్లు, మంచిర్యాలలో రూ.50.86 లక్షలు, మందమర్రి 22.46లక్షల బకాయిలున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో క్యాతన్‌పల్లి, లక్షెట్టిపేట్‌, నస్పూర్‌ మున్సిపాలిటీల్లో 100 శాతం పన్నులు వసూలయ్యాయి. వన్‌టైం సెటిల్‌మెంట్‌ అవకాశం సెప్టెంబర్‌ 15 వరకు మాత్రమే ఉందని, ప్ర జలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లోనూ వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద బకాయిలను వసూలు చేయడానికి మున్సిపల్‌ అధికారులు ప్రచారం నిర్వహిస్తున్నారు.

వన్‌టైం సెటిల్‌మెంట్‌ ఇలా..

వన్‌టైం సెటిల్‌మెంట్‌ పథకాన్ని అమల్లోకి తెచ్చిన ప్రభు త్వం మున్సిపాలిటీల్లో పేరుకుపోయిన బకాయిలను వసూలు చేసేందుకు చర్యలు తీసుకుంది. ఈ ప థకం ప్రకారం పెండింగ్‌లో ఉన్న బకా యిలపై 90 శాతం వడ్డీమాఫీ చేయను న్నారు. పెండింగ్‌లో ఉన్న బకాయి లను ఒకేసారి చెల్లించేవారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న బకాయిలతో పాటు 10 శాతం వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది. ఈ అవకాశం వచ్చే నెల 15 వరకు అమలులో ఉం టుంది. మున్సిపల్‌ రెవెన్యూ అధికా రులు బకాయి వసూళ్ల కోసం పెద్ద మొత్తంలో బాకీ ఉన్న వారి వద్దకు వెళ్లి ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశం గురించి వివరిస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో 2019-20 ఆర్థిక సంవత్సరంలో వంద శాతం పన్నులు వసూలయ్యాయి. దీనిలో నస్పూర్‌ మున్సిపాలిటీ 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.1,23, 47,000 లక్ష్యం కాగా.. మొత్తం వసూలు చేశారు. క్యాతన్‌పల్లి మున్సిపల్‌ లక్ష్యం రూ.82,04,000 కాగా.. అంతా వసూలు చేశారు. లక్షెట్టిపేట్‌ మున్సిపాలిటీ లక్ష్యం రూ.94,46,000 కాగా.. అధికారులు ఆస్తిపన్ను మొత్తం వందశాతం వసూలు చేశారు.