శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Adilabad - Aug 08, 2020 , 03:09:34

మొక్కవోని లక్ష్యం

మొక్కవోని లక్ష్యం

నిర్మల్‌ జిల్లాలో ఆరో విడుత హరితహారం జోరుగా సాగుతున్నది. ఇప్పటికే మూడింటా రెండొంతుల లక్ష్యం పూర్తికాగా, నెలాఖరుకల్లా పూర్తి లక్ష్యం చేరుకునేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో 64.75లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే 42.26 లక్షలు నాటారు. దీంతో 65.27 శాతం మేర పూర్తవగా, ఈ నెలాఖరుకు వంద శాతం చేరుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సుమారు 30 శాఖలు ఇందులో పాల్గొంటుండగా, ఇప్పటికే పలు శాఖలు లక్ష్యాన్ని చేరుకున్నాయి.

నిర్మల్‌, నమస్తే తెలంగాణ : నిర్మల్‌ జిల్లాలో ఆరో విడుత హరితహారంలో భాగంగా భారీ           సంఖ్యలో  మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఈ విడుతలో జిల్లా వ్యాప్తంగా 64,74,300 మొక్కలు నాటేందుకు లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటి వరకు 42,25,649 నాటారు. జిల్లా లో అటవీ, గ్రామీణాభివృద్ధి, ఉద్యాన వన శాఖలతో పాటు మున్సిపాలిటీ నర్సరీల్లో మొక్కలు పెంచా రు. 396 గ్రామ పంచాయతీల్లో గ్రామీణాభివృ ద్ధి శాఖ పర్యవేక్షణలో జీపీల ఆధ్వర్యంలో నర్సరీలు ఏర్పాటు చేశారు. స్థానికంగా అవసరమ య్యే మొక్కలను, ఆయా గ్రామ పంచాయతీల్లోనే అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టా రు. జిల్లాలో అవసరానికి మించి ఎక్కువే మొక్క లు ఆయా గ్రామాలు, ప్రాంతాలకు సరఫరా చేశారు. మరోవైపు మొక్కలు నాటేందుకు శాఖ ల వారీగా లక్ష్యాలు నిర్దేశించారు. సుమారు 30 శాఖలకు లక్ష్యాలను ఇవ్వగా, జిల్లాలో జో రుగా మొక్కలు నాటుతున్నారు. వర్షాలు కూడా అనుకూలిస్తుండడంతో, ఇప్పటికే ఆయా శాఖల ఆధ్వర్యంలో 65.27 శాతం మేర మొక్కలు నాటారు. జిల్లాలో అత్యధికంగా డ్వామా, ఐకేపీ ఆధ్వర్యంలో మొక్కలు నాటేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ శాఖ ఆధ్వర్యంలో 32,72, 000 మొక్కలు నాటాల్సి ఉండగా, ఇప్పటి వర కు 25,74,520 నాటి 78.68 శాతం లక్ష్యం చేరారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో అయిదు లక్ష ల మొక్కలు నాటాల్సి ఉండగా, 5,06,837 నాటి 101.37 శాతానికి చేరుకున్నారు. నిర్మల్‌ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 5,74,300 మొక్క లు లక్ష్యం కాగా, 5,12,240 నాటి, 89.19 శాతం పూర్తి చేశారు. ఇప్పటి వరకు నాలుగు శాఖల ఆధ్వర్యంలో లక్ష్యం చేరుకోగా, మిగతా శాఖలు కూడా పూర్తి చేసేందుకు వడివడిగా ముందుకు సాగుతున్నాయి. పశుసంవర్ధక శాఖ 107.10 శాతం, అటవీ శాఖ 101.37శాతం, ట్రైబల్‌ వెల్ఫేర్‌/ఐటీడీఏ ఆధ్వర్యంలో 100.92 శాతం, యువజన సర్వీసులు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో వంద శాతం లక్ష్యం పూర్తి చేశారు. మిగ తా శాఖలు కూడా ఆగస్టు 15లోగా పూర్తి చేయాలని నిర్మల్‌ కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ ఆదేశించారు. ఈ నెలాఖరు వరకు జిల్లాలో హరితహారం కార్యక్రమం 100 శాతం పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. నాటిన అన్ని మొక్కలకూ జియో ట్యాగింగ్‌ చేస్తున్నారు. ఇప్పటి వరకు 20,01,655 మొక్కలకు ఈ ట్యాగింగ్‌ పూర్తి చేశారు. 

జీపీల్లో నర్సరీలతో పాటు పార్కులు

జిల్లాలోని 396 గ్రామ పంచాయతీల్లో నర్సరీలతో పాటు పార్కులను ఏర్పాటు చేస్తున్నారు. కాగా, ఇప్పటికే 238 జీపీల్లో భూముల ఎంపిక చేసి, పనులు చేపట్టారు. మిగతా చోట్ల కూడా భూ ములను ఎంపిక చేస్తున్నారు. ఈ నెల 10 లోగా ఈ పనులు ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సాధ్యమైనంత వరకు ప్రభుత్వ భూముల్లోనే ఏర్పాటు చేయాలని ఆదేశించ గా, వీటిని గుర్తించే బాధ్యతను స్థానిక తహసీల్దార్లకు అప్పగించింది. అర ఎకరాకు తగ్గకుం డా.. ఎకరాకు మించకుండా స్థలంలో ఈ పా ర్కులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ భూ ములు లేని చోట్ల, గ్రామ పంచాయతీ ఆధ్వర్యం లో కొనుగోలు చేసి ఇవ్వాల్సి ఉంటుంది. గ్రామ పం చాయతీలు ముందుకు రాని చోట్ల.. జిల్లా కలెక్టర్‌ నిర్ణయం తీసుకోనున్నారు. 

20 నాటికి వంద శాతం పూర్తి.. 

జిల్లాలో ఆరో విడుత హరితహారంలో భాగం గా జోరుగా మొక్కలు నాటుతున్నాం. ఇప్పటికే 65.27శాతం లక్ష్యం చేరుకున్నాం. ఈ నెల 20 లోగా జిల్లాలో అన్ని శాఖలు 100 శాతం లక్ష్యం చేరుకుంటాయి. నాటిన ప్రతి మొక్కకూ జియో ట్యాగింగ్‌ చేస్తున్నాం. వీటిని రక్షించే బాధ్యత గ్రామ పంచాయతీలకు అప్పగించాం. మొక్కల సంరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. ఈ నెల 10లోగా భూములు ఎంపిక చేసి, పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టాం.

- వెంకటేశ్వర్లు, డీఆర్‌డీవో, నిర్మల్‌logo