గురువారం 04 మార్చి 2021
Adilabad - Aug 06, 2020 , 02:40:11

వేదికలు వేగవంతం చేయాలి

వేదికలు వేగవంతం చేయాలి

  • n నిర్ణీత వ్యవధిలో పూర్తిచేయాలి
  • n కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌
  • n గుడిహత్నూర్‌ మండలంలో జేసీ సంధ్యారాణితో కలిసి సుడిగాలి పర్యటన
  • n సీతాగొంది, మన్నూర్‌, కొల్హారి, గుడిహత్నూర్‌లో రైతువేదిక,  పల్లె ప్రగతి పనుల పరిశీలన
  • n పనుల జాప్యంపై అసహనం
  • n అధికారుల తీరుపై ఆగ్రహం
  • n వారం రోజుల్లో వేగవంతం  చేయాలని ఆదేశం

గుడిహత్నూర్‌ రూరల్‌ : రైతు వేదిక నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని అధికారులను ఆదిలాబాద్‌ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ ఆదేశించారు. మండలంలో బుధవారం సుడిగాలి పర్యటన చేశారు. సీతాగొంది, కొల్హారి, మన్నూర్‌, గుడిహత్నూర్‌ గ్రామాల్లో జేసీ సంధ్యారాణితో కలిసి రైతు వేదిక, పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. సీతాగొందిలో రైతు వేదిక పనుల గురించి పీఆర్‌ ఏఈ అనిల్‌ను అడిగి తెలుసుకున్నారు. కాంట్రాక్టర్‌తో మాట్లాడి, నాణ్యతతో నిర్మించాలని ఆదేశించారు. సామాజిక తనిఖీ చేపడుతామని, తేడా వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇసుక రవాణాలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని తహసీల్దార్‌ పవన్‌చంద్రకు సూచించారు. అనంతరం ఆయా గ్రామాల్లో పల్లె ప్రగతి పనుల పురోగతిపై సర్పంచ్‌లను అడిగి తెలుసుకున్నారు. సీతాగొంది, మన్నూర్‌ గ్రామాల్లో డంప్‌యార్డులు, శ్మశాన వాటికలు, సెగ్రిగేషన్‌ షెడ్ల నిర్మాణంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే పల్లె ప్రగతి పనులు మొదలై ఏడాది గడిచినా ప్రారంభ దశలోనే ఉన్నాయని ఎంపీడీవో పుష్పలత, ఎంపీవో లింగయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో పర్యవేక్షణ చేయకపోవడంపై నిలదీశారు. వారం రోజుల్లో పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. హరితహారం లక్ష్యం చేరుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మండల అధికారులు శుక్రవారం సమీక్షకు రావాలని, మండల ప్రత్యేకాధికారి, డీఈవో ఏనుగు రవీందర్‌రెడ్డిని ఆదేశించారు. పల్లె ప్రకృతి వనాల కోసం స్థలాల ఎంపిక వేగవంతం చేయాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. కలెక్టర్‌ వెంట మండల ప్రత్యేక అధికారి రవీందర్‌ రెడ్డి, తహసీల్దార్‌ పవన్‌ చంద్ర, ఎంపీడీవో పుష్పలత, ఏవో భాస్కర్‌, ఎంపీవో లింగయ్య, ఎంపీపీ రాథోడ్‌ పుండలిక్‌, జడ్పీటీసీ పతంగే బ్రహ్మానంద్‌, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు కరాడ్‌ బ్రహ్మానంద్‌, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్యదర్శులు ఉన్నారు.   


VIDEOS

logo