కరోనా కంటే చిన్నచూపే భయంకరం

- lఅపోహలతో ‘సామాజిక దూరం’
- lకనీస భరోసా ఇచ్చే వారూ కరువే
- lకోలుకున్నా దూరం దూరమే
- lవిసృ్తత ప్రచారం చేస్తున్నా మారని తీరు
- lబాధిత కుటుంబాలకు మానసికంగా నరకం
- lఎవరికీ చెప్పుకోవాలో తెలియక అంతులేని వేదన
- lఅవగాహన కల్పిస్తాం : అధికారులు
కరోనా మహమ్మారి కంటే.. ఇప్పుడు ‘వివక్షే పెద్ద రోగం’గా కనిపిస్తున్నది. ఇది వైరస్ బాధితులు, అనుమానితులను భయంక రంగా వెంటాడుతున్నది. హోం ఐసొలేషన్‌లో ఉన్నవారితోపాటు వైరస్ నుంచి పూర్తిగా కోలుకొని బయటికి వచ్చిన వారిని వెలేసి నట్లు చూస్తుండడం మానసికంగా కుంగదీస్తున్నది. మానవతా దృష్టితో చూడాల్సింది పోయి అమానుషంగా ప్రవర్తిస్తుండడం బాధ కలిగిస్తున్నది. అధికారులు, ప్రజాప్రతినిధులు పదే పదే చెబుతున్నా తీరు మారకపోగా, సాటి మనుషులతో మర్యాదగా ప్రవర్తించాలన్న కనీస స్పృహను మరిచి చిన్నచూపు చూడడం బాధిత కుటుంబాలను దారుణంగా వేధిస్తున్నది. ఇదే పరిస్థితి రేపో మాపో మనకూ ఎదురైతే ఎంటన్నది? ఎవరికి వారు ప్రశ్నించుకోవాల్సిందే!
సమష్టి కృషితో అధిగమిస్తున్నాం
మంచిర్యాల అగ్రికల్చర్ : ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో సమష్టిగా సమర్థవంతంగా సేవలు అందిస్తున్నాం. మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యా యి. మేం వైరస్ బారిన పడ్డ వారితో మాట్లాడి మానసిక ధైర్యం నింపుతున్నాం. వారంతా త్వరగా కోలుకునేందుకు కృషి చేస్తున్నాం. ఎప్పటికప్పుడు జాగ్రత్తలు చెబుతున్నాం. వైరస్ బారిన పడ్డ వారిపట్ల వివక్ష చూపవద్దు.
- డాక్టర్ నీరజ, డీఎంఅండ్‌హెచ్‌వో, మంచిర్యాల
వెంటాడుతున్న భయం..
కరోనా సృష్టిస్తున్న ప్రళయంలో ఏదో తెలియని భయం జనంలో ఆవహించింది. సరైన అవగాహన లేక అన్నిచోట్లా వివక్ష రాజ్యమేలుతున్నది. పట్టణాలు, పల్లెలనే తేడా లేకుండా వైరస్ సామాజిక వ్యాప్తి చెందుతుండగా, ప్రతి ఒక్కరినీ ఏదో తెలియని భయం వెంటాడుతున్నది. ఈ కారణంగానే బాధితులపై అనేక రూపాల్లో వివక్ష కనిపిస్తున్నది. నిజానికి ఈ వైరస్ కంటే.. సామాజిక దూరం పేరుతో ‘సోషల్ బైకాట్' రోగులను తీవ్రంగా వేధిస్తున్నది. కేసుల సంఖ్యలో విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో రోగులతో సన్నిహితంగా ఉంటే వైరస్ తమకూ సోకుతుందేమోనన్న భయం జనాన్ని పీడిస్తున్నది.
ధైర్యమే దానికి మందు
మంచిర్యాల అగ్రికల్చర్ : కరోనా సోకితే భయప డాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉం డడమే దీనికి సరైన మందు. అన్ని వైర స్ల మాదిరిగానే దీనిని తీసుకోవాలి త ప్ప ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కేవలం గాలి ద్వారా, కాంటాక్ట్ ద్వారా వచ్చే వైరస్ ఇది. వైరస్ సోకిన వారికి దూరంగా ఉండాలి అనే ఆలోచనలో మా ర్పురావాలి. తగిన జాగ్రత్తలు పాటిస్తే వైరస్ వచ్చే అవకాశం ఉండదు. - డాక్టర్ విశ్వేశ్వర్ రావు, సైక్రియాటిస్ట్, మంచిర్యాల
లేనిపోని అపోహలు..
వైరస్ ఇప్పట్లో పోయేది కాదు. పాజిటివ్ కేసుల సంఖ్య భవిష్యత్తులో మరింత పెరిగే ప్రమాదమున్నది. కరోనా సోకిన ప్రతి ఒక్కరూ దవాఖానల్లో చేరాల్సిన అవసరం లేదు. లక్షణాలు లేని వారు హోం ఐసొలేషన్‌లో చికిత్స పొందవచ్చు. ఇప్పుడు వస్తున్న పాజిటివ్ కేసుల్లో 85 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో హోం ఐసోలేషనే బెటర్ అని వైద్యులు చెబుతున్నారు. ఈ సూచనలతో చాలా మంది ఇండ్లలో నే ఉంటూ, చికిత్స పొందుతున్నారు. 17 రోజుల్లో రోగులు కోలు కుంటున్నారు. ఆ తర్వాత మనలో ఒకరిగా కలిసి పోతున్నారు. ఇదే మిగతా జనంలో భయానికి కారణమవుతున్నది. బాధితులకు దూరంగా ఉండాలని జరుగుతున్న ప్రచారం క్రమంగా వివక్షకు దారితీస్తున్నది. రోగులపై కనికరం చూపాల్సిన సమయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. వారి మానసిక ధైర్యం దెబ్బతినేలా ప్రవర్తిస్తున్నారు. ఫలితంగా రోగులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఇది సరైంది కాదు. ఏదో ఒక రోజు మనం కూడా వైరస్ బారిన పడే ప్రమాదముందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. హోం ఐసొలేషన్‌పై అవగాహన పెంచుకోవాలి. వైరస్ సోకిన వారిని వెలివేసినట్లు చూడడం మంచిది కాదు. బాధితులు తమకు సమీపంలో ఉన్నప్పుడు ఇరుగు పొరుగు భయపడడం సహజం. కానీ, వివక్షకు దారితీయద్దు. అలా చేయడం వల్ల రోగుల ఆత్మైస్థెర్యం దెబ్బతింటుంది. బాధితులకు మనోధైర్యాన్ని ఇవ్వడం మన బాధ్యతగా భావించాలి.
చిన్నచూపు వద్దు..
కరోనాపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న నిబంధనల గురించి తెలుసుకోవాలి. మనం పోరాడాల్సింది రోగితో కాదు, రోగంతో అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇలాంటి ఆపత్కాలంలో కరోనా బాధితులను వేరు చేసి చూడడం వారిని మానసిక వేదనకు గురి చేస్తున్నది. వైరస్‌పై అవగాహన లేకనే చాలాచోట్ల బాధితులపై వివక్ష కనిపిస్తున్నది. కొవిడ్-19 అంటు వ్యాధే అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనల్ని మనం రక్షించుకోవచ్చు. మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించి కాపాడుకోవచ్చు. కొవిడ్ నిబంధనలు పాటిస్తే ఎప్పటికీ సురక్షితంగా ఉండే అవకాశమున్నది. కానీ, వీటి గురించి అవగాహన పెంచుకోకుండా బాధితులను చిన్నచూపు చూడడం సరికాదు. వైరస్‌తో బాధపడుతున్న వారితో సహృదయంతో మెలగాలి. భౌతిక దూరం పాటిస్తూనే, వారిని మానసికంగా బలహీన పడకుండా చూసుకోవాలి. పూర్తిగా కోలుకున్న తర్వాత వారిని మనలో ఒకరిగా చూడాలి. మనవతా దృక్పథం చాటాలి. అలాంటప్పుడే కరోనా మహమ్మారిని జయిస్తాం. ఈ దిశగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరమున్నది.
తాజావార్తలు
- రేపటి నుంచి మలి విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
- పోడు భూముల సమస్య పరిష్కరిస్తాం : మంత్రి సత్యవతి రాథోడ్
- న్యాక్ హైదరాబాద్‌కు సీఐడీసీ అవార్డు ప్రదానం
- ఆస్ట్రాజెనెకాను సస్పెండ్ చేసిన ఆస్ట్రియా ప్రభుత్వం
- తాగు నీటి ట్యాంక్‌కు టాయిలెట్ పైప్.. రైల్వేస్టేషన్ మాస్టర్ సస్పెండ్
- రోజూ పుచ్చకాయ తినడం మంచిదేనా
- అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరిన నటుడు దేవన్
- బంగారం రుణం: యోనోతో నో ప్రాసెసింగ్ ఫీజు
- అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీశ్ రావు
- వాగుడు తగ్గించుకుని బుద్ధిగా ఉండాలి..లేదంటే,