సోమవారం 21 సెప్టెంబర్ 2020
Adilabad - Aug 05, 2020 , 01:58:41

ప్రకృతి వనాలకు స్థలాలను గుర్తించాలి

ప్రకృతి వనాలకు స్థలాలను గుర్తించాలి

  •  ఎంపీడీవో రమాకాంత్‌
  •  పంచాయతీ కార్యదర్శులు,   ఈజీఎస్‌ సిబ్బందితో సమావేశం

ఇంద్రవెల్లి : గ్రామాల్లో ప్రకృతి వనాల ఏర్పాటుకు స్థలాలను గుర్తించాలని ఎంపీడీవో రమాకాంత్‌ అన్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్‌ సి బ్బందితో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఉపాధిహామీ  పథకంలో చేపట్టిన, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వనాల కోసం ప్రభుత్వ భూములు అందుబాటులో లేకపోతే రైతుల నుంచి కొనుగోలు చేసి నిర్మించాలన్నారు. కంపోస్ట్‌ షెడ్లతో పాటు శ్మశాన వాటిక పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఎంపీవో సంతోష్‌, ఏపీవో సంతోష్‌జైస్వాల్‌, ఈసీ జాదవ్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.logo