శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Adilabad - Aug 05, 2020 , 01:58:43

పచ్చ బడింది

పచ్చ బడింది

  • ఆహ్లాదపూరిత వాతావరణంలో బోథ్‌ గురుకుల పాఠశాల 
  • హరితహారం ద్వారా విరివిగా మొక్కల పెంపకం

బోథ్‌: బోథ్‌ గురుకుల పాఠశాలలో పచ్చదనం పరుచుకున్నట్లుగా కనిపిస్తున్నది. హరిత శోభితంతో ఆహ్లాదపూరిత వాతావరణం కల్పిస్తున్నది. బోథ్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల హరిత హారంలో భాగంగా పచ్చ‘బడి’ంది.. ఐదు విడుతలుగా నిర్వహించిన హరితహారంలో వివిధ రకాలైన 1600 మొక్కలు నాటగా. ప్రస్తుతం ఏపుగా పెరిగాయి. మొదటి, రెండో విడుత కింద నాటిన మొక్కలు చెట్లుగా ఎదిగి నీడనిస్తున్నాయి. పాఠశాల ప్రధాన ద్వారం నుంచి పాఠశాల భవనం వరకు సీసీ రోడ్డుకు ఇరువైపులా నాటిన చెమన్‌ మొక్కలు పచ్చదనంతో స్వాగతం పలుకుతున్నాయి. భవనం చుట్టుపక్కలా నాటిన అశోక చెట్లు, పూల మొక్కలు, కానుగ, వేప చెట్లు అందాన్ని తెచ్చి పెడుతున్నాయి. ఆరో విడుత కార్యక్రమంలో కూడా  భాగస్వాములవుతున్నారు. నాటిన ప్రతి మొక్కనూ కాపాడేందుకు ప్రిన్సిపాల్‌ స్వర్ణలత, ఉపాధ్యాయులు, సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. logo