మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Adilabad - Aug 02, 2020 , 23:57:42

గోలేటి.. పచ్చదనం వెల్లివిరిసి..

గోలేటి.. పచ్చదనం వెల్లివిరిసి..

ఆకుపచ్చని చెట్లతో ఏరియాకు కళ

ఎటు చూసినా ఆహ్లాదకర వాతావరణం

హరితహారం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి. రాష్ట్రంలో అడవులకు పూర్వవైభవం తేవాలని, పచ్చదనం పెంచాలని సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపునకు అనుగుణంగా ప్రజలు కూడా పచ్చని కాలనీలుగా తీర్చిదిద్దుకుంటున్నారు. సింగరేణి సంస్థ ఇందులో పెద్ద ఎత్తున పాల్గొంటున్నది. బెల్లంపల్లి ఏరియాలోని గోలేటిటౌన్‌షిప్‌లో జీఎం కార్యాలయంతో పాటు అధికారుల బంగ్లాలు, బీ-టైప్‌, సీ-టైప్‌, సీటూటైప్‌, ఎస్‌డీ-టైప్‌, డీ-టైప్‌ క్వార్టర్లు ఉండగా, అంతటా పచ్చదనం పరుచుకున్నట్లుగా ఉంటుంది. ప్రతి క్వార్టర్‌లో మామిడి, జామ, కొబ్బరి, సీతాఫలం, దానిమ్మ, నిమ్మ, ఉసిరి, అరటి, అల్లనేరేడు లాంటి పండ్ల చెట్లు కనిపిస్తుంటాయి. రోడ్లకు ఇరువైపులా రావి, వేప లాంటి చెట్లు పెద్ద సంఖ్యలో  దర్శనమిస్తాయి.                 

పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం

పర్యావరణ పరిరక్షణకు సింగరేణి సంస్థ ప్రాధాన్యమిస్తున్నది. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగస్వామ్యమవుతూనే ఏరియాలో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటి సంరక్షణకు  చర్యలు తీ సుకుంటున్నాం. కార్మిక కాలనీలు, గనులు, డిపార్టుమెంట్ల వద్ద వివిధ రకాల మొక్కలు నాటాం. ఏరియాలోని ఖాళీ ప్రదేశాల్లో ప్లాంటేషన్‌ ఏర్పాటు చేసి వందల సంఖ్యలో మొక్కలు నాటి, వాటి రక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాం.

-కే.కొండయ్య, జీఎం బెల్లంపల్లి ఏరియా


logo