శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Adilabad - Aug 02, 2020 , 23:57:54

నెట్టింట్లో ఆ‘నీతి’ కథలెన్నో..

నెట్టింట్లో ఆ‘నీతి’ కథలెన్నో..

“ఒక రాజుకు ఏడు గురు కొడుకులు.. వారు చేపల వేటకు వెళ్లారు” అంటూ నానమ్మ, అమ్మ మ్మలు మొదలు పెట్టిన కథ అయిపోయేసరికే నిద్రలోకి జారుకోవడం ఈ కాలం పిల్లలు అస్సలు ఎరగరు. ఒకప్పుడు రాత్ర యితే చాలు.. కమ్మని కథ ల కోసం పిల్లలందరూ అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యల చుట్టూ చేరేవారు. కథలు విం టుంటే ఆకలి, దప్పికలు మరిచేవారు. “అనగనగా..” అంటూ అమ్మమ్మ మొదలు పెట్టగానే చెవులు అప్పగించి వినేవారు. కథలు చెబుతున్నంతసేపు ఓ ఊహాలోకంలో స్వేచ్ఛగా తిరిగే వారు. కానీ నేటితరం వారు ఆ స్వేచ్ఛకు దూరమై పోయింది. లాక్‌డౌన్‌ కారణంగా పిల్లలు ఇంటి పట్టునే ఉంటూ సెల్‌ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నారు. ఆన్‌లైన్‌ క్లాస్‌లు, పబ్‌జీ గేమ్‌లు అంటూ సమయాన్ని వృథా చేస్తున్నారు.  రోజురోజుకూ పెరుగుతున్న మహమ్మారి కరోనాపై ఆందోళన వదిలేసి పిల్లలకు నీతి కథలు బోధించాలని వ్యక్తిత్వ వికాస నిపుణులు పేర్కొంటున్నారు. 

- బజార్‌హత్నూర్‌

ప్రస్తుతం కరోనా సెలవుల్లో పిల్లలను ఒక్క దగ్గర కూర్చోబెట్టి అల్లరి చేయకుండా చూసేందుకు తల్లిదండ్రులు పడే పాట్లు అన్నీఇన్ని కావు.. అర్థం లేని కార్పొరేట్‌ చదువులు, మొబైల్‌ వ్యామోహం పిల్లల స్వచ్ఛతకు ప్రతి బంధకాలవుతూ వస్తున్నాయి. ఇంటర్నెట్‌ ఇరుకు సందులే జీవన రహదారులుగా మారిపోయాయి. ఇలాంటి సమయంలో లాక్‌డౌన్‌ కారణంగా నిర్బంధ సెలవులు మంజూరుకావడంతో గణనీయమైన మార్పు లు చోటు చేసుకుంటూ వచ్చాయి.

సెల్‌ఫోన్లతో ఉపయోగపడే మేధోసంపత్తి 

టెక్నాలజీ పెరిగేకొద్దీ కలం, కాగితాలతో పని తగ్గుతున్నది. నేరుగా కంప్యూటర్లలోనే కథలు రాయడం, వినడం మొదలు పెడుతున్నారు. కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌, స్మార్ట్‌ ఫోన్‌లో నెట్‌ సౌకర్యం ఉంటే చాలు.. చెడు వ్యాసనాల వైపు తీసుకెళ్లకుండా.. మేధాసంపత్తికి ఉపయోగ పడే కదిలే బొమ్మలతో నీతి కథలను చదివిస్తూ పిల్లలను బుద్ధిమంతుల్లా ఉంచేందుకు ఆన్‌లైన్‌లో అలనాటి నేటి కథలు అందుబాటులో ఉన్నాయి. చందమామ, పంచతంత్రం, ఆలీబాబా 40 దొంగలు, పరమానందయ్య శిష్యులు, భాగవతకథలు, టార్జాన్‌కథలు, పెదరాసిపెద్దమ్మ, బేతాళకథలు, అక్బర్‌బీర్బల్‌, తెనాలి రామకృష్ణకవి, స్వామి వివేకానంద, సింహం చిట్టెలుక, హాస్యకథల పుస్తకాలతో పాటు చదవు, సాహిత్యం, క్రీడలు, సాంస్కృతికం.. ఇలా తదితర అంశాలు కలిగిన పుస్తకాలు, వెబ్‌సైట్లు ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో అందుబాటులో ఉన్నాయి. తెరిచి చూస్తే తరగని జ్ఞానం సొంతమవుతుంది.

నీతి కథలతో ఎంతో మేలు.. 

వెబ్‌సైట్‌లతో పాటు యూట్యూబ్‌ ద్వారా సాహిత్యానికి సంబంధించిన అంశాలు, చరిత్ర, పురాణాలు, కార్టూన్‌ కథలు, బాలగేయాలు, బాల సాహిత్యం వంటివి ఎన్నో చిన్నారుల మేధో సంపత్తిని పెంచేందుకు అందుబాటులో ఉన్నాయి. చిన్నారులు ఇష్టంగా పాడుకునే చిట్టిచిలకమ్మ, చుక్‌చుక్‌రైలు, ఏనుగమ్మ ఏనుగు, బుర్రుపిట్ట.. వంటి పలు రకాల పాటల వీడియోలు కళ్లముందు కదులుతాయి. లాక్‌డౌన్‌కాలంలో పిల్లలు చెత్త గేమ్‌లు పబ్‌జీ, లోడో వంటి జోలికి వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. తాతయ్య, అమ్మమ్మ, నానమ్మలు చెప్పే నీతి కథలు పిల్లలకు కలకాలం గుర్తుండిపోయేలా ఎంతో మేలు చేకూరుంది. అందుకు ముందడుగు వేయాలి.

- జువ్వల భూమన్న, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, యోగా, వ్యక్తిత్వ వికాస నిపుణుడుlogo