ఆదివారం 09 ఆగస్టు 2020
Adilabad - Aug 02, 2020 , 01:16:48

‘చెక్‌' చకా..

‘చెక్‌' చకా..

ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ : వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఆదిలాబాద్‌ జిల్లాలో రైతుల పాలిట వరంగా మారాయి. ఇప్ప టికే రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్‌, మిష న్‌ కాకతీయ వంటి పథకాలతో రైతులకు ప్రయోజనం చేకూరుతున్నది. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా సాగు విస్తీర్ణం పెరుగుతున్నది.  సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి పెద్దపీట వేస్తున్న సర్కారు చెనాక-కొరటా, పిప్పల్‌కోటి ప్రాజెక్టులను నిర్మిస్తున్నది. మిషన్‌ కాకతీయ పథకంలో భాగంగా జిల్లాలో 205 చె రువులకు మరమ్మతులు చేపట్టారు. ఫలితంగా 35 వేల ఎక రాల ఆయకట్టు పెరిగింది. అంతేకాకుండా గ్రామాల్లో తాగునీటికి ఇబ్బందులు తప్పాయి. చేపల పెంపకంతో మత్స్యకారులకూ ఉపాధి మెరుగుపడింది. యేటా వానకాలంలో 1200 మిల్లీమీటర్ల అధిక వర్షపాతం నమోదవుతున్నది. ఫలితంగా చెరువులు మత్తడి దూకుతుండగా.. వాగులు, వంకలు పొం గి ప్రవహిస్తూ భారీగా వర్షపు నీరు వృథాగా పోతున్నది. దీనిని అరికట్టి నీటిని నిల్వ చేసుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నీటి ప్రవాహానికి అడ్డంగా చెక్‌డ్యాంలను నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధుల సహకారంతో అధికారులు ప్రణాళికలు రూపొందించారు. గ్రామాల్లోని వర్షపు నీరు ప్రవహించే ప్రదేశాలను గుర్తించి రైతులకు ప్రయోజనం చేకూరేలా నివేదికలు సర్కారుకు పంపారు. 

మొదటి విడుతలో 47 చెక్‌డ్యాంలు

ఈ యేడాది మార్చిలో మొదటి విడుతలో భాగంగా 47 చెక్‌డ్యాంలను సర్కారు మంజూరు చేసింది. నీటి పారుదలశాఖ ఆదిలాబాద్‌, ఇచ్చోడ, ఉట్నూర్‌ సబ్‌ డివిజన్‌లో రూ. 125.35 కోట్లతో 47 చెక్‌డ్యాంలు నిర్మిస్తుండగా.. 6,020 ఎకరాల ఆయకట్టుకు నీరు అందనున్నది. ఇప్పటికే కొన్ని చెక్‌డ్యాం ల పనులు పూర్తికాగా.. మరికొన్ని  నిర్మాణ దశల్లో ఉన్నాయి. పూర్తయిన చెక్‌డ్యాంలలో ఇటీవల కురిసిన వర్షాలతో కిలోమీటర్ల మేర నీరు నిలిచి నిండుకుండను తలపిస్తున్నాయి. ఆదిలాబాద్‌ సబ్‌డివిజన్‌లో రూ.29.82 కోట్లతో 14 చెక్‌డ్యాంలు నిర్మిస్తుండగా 1,950 ఎకరాలు, ఇచ్చోడ సబ్‌డివిజన్‌లో రూ. 53.63 కోట్లతో నిర్మించే 16 చెక్‌డ్యాం ద్వారా 1,495 ఎకరాలకు, ఉట్నూర్‌ సబ్‌డివిజన్‌లో రూ.41.90 కోట్ల తో నిర్మించే 17 చెక్‌డ్యాంలతో 2,575 ఎకరాలకు సాగునీరు అందనుంది. ఇన్ని రోజులు వృథాగా పోయిన నీటిని చెక్‌డ్యాం లు నిర్మించి  నిల్వ చేస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ పంటలకు ఢోకా ఉండదని అంటున్నారు. 


logo