బుధవారం 05 ఆగస్టు 2020
Adilabad - Aug 01, 2020 , 00:25:12

ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతివనాలు

ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతివనాలు

 ఆదిలాబాద్‌ రూరల్‌ : పల్లె ప్రజలకు స్వచ్ఛమైన ప్రాణవాయువును అందించేందుకు ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నామని ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మావల మండలంలోని వాఘాపూర్‌లో రూ.3.84 లక్షలతో నిర్మించనున్న పల్లె ప్రకృతి వనం పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలు, చిన్నారులకు ఆహ్లాదాన్నిచ్చేందుకు ప్రతి గ్రామంలో వనాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ‘హరితహారం’లో అందరూ భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. పెద్ద సంఖ్యలో మొక్కలు నాటి, హరిత తెలంగాణ సాధించేందుకు కృషిచేయాలన్నారు. అలాగే రైతుల బాగుకోసం క్లస్టర్ల వారీగా రైతు వేదికలను నిర్మిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, మావల జడ్పీటీసీ నల్లా వనిత, ఎంపీపీ చందాల ఈశ్వరి, లక్ష్మి, టీఆర్‌ఎస్‌ నాయకులు నల్లా రాజేశ్వర్‌, చందాల రాజన్న పాల్గొన్నారు.



logo