శుక్రవారం 22 జనవరి 2021
Adilabad - Jul 14, 2020 , 03:38:46

అవగాహనతోనే అడ్డుకట్ట

అవగాహనతోనే అడ్డుకట్ట

కొవిడ్‌ 19పై అతి ఆందోళన అవసరం లేదు

లక్షణాలుంటే పరీక్షలు తప్పనిసరి

పలు జాగ్రత్తలతో ఆరోగ్యం బాగు

నిర్లక్ష్యం చేస్తే మొదటికే ముప్పు

ఆదిలాబాద్‌ జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజు రోజుకూ   పెరుగుతున్నాయి. ప్రస్తుతం 62 మందికి పాజిటి వ్‌ రాగా, ఇందులో 45 మంది ఆరోగ్యంగా డిశ్చార్జి అయ్యా రు. ఇంటి వద్ద రోజు వారీ పనులు చేసుకుంటున్నారు. మరో 16 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో 14 మంది రి మ్స్‌లో, మరో ఇద్దరు హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. కాగా, కరోనా వైరస్‌పై ప్రజలంతా పూర్తి అవగాహన కలిగి ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. పాజిటివ్‌ వస్తే, ఏదో జరు గుతుందనే భయాన్ని వీడి, 14 రోజుల పాటు వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలని చెబుతున్నారు. అయితే  దీర్ఘకాలిక రోగులు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలని, లక్షణాలు ఏ మాత్రం కనిపించినా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నారు. 

లక్షణాలు లేకున్నా..

ఒక్కోసారి ఎలాంటి లక్షణాలు లేకున్నా, కరోనా పాజిటి వ్‌గా నిర్ధారణ అవుతోంది. ఇందులో స్వల్ప, మధ్య స్థాయి లక్షణాలు ఉంటున్నాయి. 60 ఏళ్ల లోపు వారు ఎ లాంటి ఆరోగ్యపరమైన సమస్యలు లేకుంటే, తేలిగ్గా కోలుకుంటు న్నారు. వీరు హోం ఐసొలేషన్‌లో ఉంటూ వైద్యుల సలహా లు సూచనలు పాటిస్తే సరిపోతుంది. 60 ఏళ్లు దాటి, బీపీ, షుగర్‌, గుండె సంబంధిత, కిడ్నీ, లివర్‌ తదితర స మస్యలు ఉన్నవారు వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ చికిత్స పొందా ల్సి ఉంటుంది.

పరీక్షలు చేయించుకోవాల్సింది వీరే..

తమ ప్రాంతంలో ఒకరికి కరోనా పాజిటివ్‌ వస్తే. మిగతా వారు అవసరం లేకున్నా పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇలాంటి అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. జ లు బు, దగ్గు, జ్వరం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడేవారు, పాజిటివ్‌ వచ్చిన వారితో సన్నిహితంగా ఉన్న వారు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు పరీక్షలు చేయించకోవాల ని వైద్యులు సూచిస్తున్నారు. 

నిర్లక్ష్యం చేస్తే మొదటికే ముప్పు

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రమాదం కొని తెచ్చుకున్నట్లే. కరోనా వైరస్‌ నోరు, ముక్కు, కండ్ల ద్వారా శరీరంలోని శ్వా సకోశ వ్యవస్థలోకి ప్రవేశిస్తుంది. గొంతునొప్పి, జలుబు, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు కలిగి జ్వరం వస్తుంది. సరైన సమయంలో వైద్యం తీసుకుంటే తగ్గిపోతుంది. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా, న్యుమోనియాగా మారి ప్రాణాని కే ముప్పు తెస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఆహారంతో పాటు మందులు తీసుకుంటే తగ్గిపోతుంది.

అతిభయం అసలే వద్దు..

పాజిటివ్‌ వచ్చిన వారు ధైర్యంగా ఉండాలి. అతి భ యంతో శరీరంలోని రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. మ నోధైర్యమే ప్రతి ఒక్కరినీ కాపాడుతుంది. తమకు ఇష్టమైన వారితో ఫోన్‌లో మాట్లాడుతూ, సంగీతం వింటూ ప్రశాతం గా ఉండేలా చూసుకోవాలి. జలుబు, గొంతునొప్పి తగ్గడానికి ఆవిరి పట్టుకోవాలి. కషాయం లాంటి వాటితో రుగ్మత లు దూరమవుతాయి.

హోం ఐసొలేషన్‌లో ఉంటే కరోనా కిట్‌

కరోనా పాజిటివ్‌ వచ్చిన వారు హోం ఐసొలేషన్‌లో ఉం టే వారికి ప్రభుత్వమే ప్రత్యేక కిట్‌ను సరఫరా చేయనుంది. చికిత్సకు అవసరమైన మందులు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌,  పా రాసిటమాల్‌, యాంటీ బయాటిక్స్‌, విటమిన్‌ సీ,ఈ,డీ, గ్యా స్‌కాకుండా ఉండే గోళీలు, శానిటైజర్లు, మాస్కులతో పాటు ఆవగాహన కోసం పుస్తకం ఉంటుంది. వైద్యాధికారులు హోం ఐసొలేషన్‌లో ఉన్న వారి ఇండ్లకు వెళ్లి ఈ కిట్‌ను పం పిణీ చేస్తారు.

అవగాహన తప్పనిసరి..

జిల్లాలో ప్రతి ఒక్కరూ కొవిడ్‌19 పై అవగాహన కలిగి ఉండాలి. ప్ర భుత్వం సూచించిన ఐదు అంశాల ను తప్పనిసరిగా పాటించాలి. లక్షణా లు కనిపిస్తే వెంటనే వైద్యులను సం ప్రదించి, పరీక్షలు చేయించుకోవాలి. పాజిటివ్‌ వస్తే ఆందోళన చెందాల్సిన పనిలేదు. 14 రోజులు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందితే నయమవుతుంది. రిమ్స్‌లో పరీక్ష లు చేయించుకునే అవకాశం ఉంది.  చికిత్స కూడా అందిస్తారు.

- కుడ్మిత మనోహర్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో

కరోనా.. ప్రస్తుతం మానవాళిపై విరుచు కుపడుతున్న వైరస్‌. చిన్నాపెద్దా అని తే డా లేకుండా ప్రతి ఒక్కరినీ బాధితులుగా చేస్తు న్న మహమ్మారి. మందులేని ఈ కొవిడ్‌-19 ను అవగాహనతో మాత్రమే అడ్డుకట్ట వేయగలమని వైద్యులు చెబుతున్నారు. పాజిటివ్‌ వచ్చినా, మనోధై ర్యంతో ముం దుకెళ్తేనే బయటపడే అవకాశం ఉంటుందని సూచిస్తు న్నారు. చాలామందికి లక్షణాలు ఉండకపోగా మరికొందరికి స్వల్పంగా, మధ్యస్తంగా కనిపిస్తు న్నాయి. పరిస్థితి విషమించకముందే వైద్యులను సంప్రదిస్తే త్వరగా  బయటపడవచ్చు. 


logo