శనివారం 08 ఆగస్టు 2020
Adilabad - Jul 13, 2020 , 00:39:25

బో‘నమో’ పోచమ్మ తల్లీ..!

బో‘నమో’ పోచమ్మ తల్లీ..!

ఉట్నూర్‌ / నేరడిగొండ / జైనథ్‌ /బోథ్‌ / ఆదిలాబాద్‌ రూరల్‌ / సోన్‌ : శ్రావణ మాసానికి ముందు గ్రామదేవత అయిన పోచమ్మకు ప్రజలు మొక్కు లు తీర్చుకోవడం ఆనవాయితీ. ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ మండల కేంద్రంతో పాటు గ్రామా ల్లో పోచమ్మ ఆలయాల వద్ద ఆదివారం భక్తుల సందడి కనిపించింది. అమ్మవారికి కోళ్లు, మేకలు బలిచ్చారు. నేరడిగొండ మండలం బుద్దికొండ మహాలక్ష్మీ అమ్మవారికి భక్తులు ఆషాఢ బోనాలు సమర్పించారు. అమ్మవారికి నైవేద్యం అక్కడే వండి సమర్పించారు. జైనథ్‌ మండలం బెల్గాం లో గ్రామస్తులు భీమన్న దేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోథ్‌ మండల కేంద్రం సమీపంలోని మేడిగుట్టపై ఉన్న భీమన్న దేవుళ్లకు రైతులు పూజలు చేశారు. చుట్టు పక్కల పొలాలున్న రైతు లు అక్కడికి చేరుకొని ప్రసాదాలు వండారు. సం ప్రదాయం ప్రకారం బాలలతో పూజలు చేయించారు.  ప్రసాదం పంచి పెట్టారు. అనంతరం మేకలను బలిచ్చారు. ఆదివాసీ నాయక్‌పోడ్‌ల ఆరాధ్యదైవం భీమన్న దేవుడికి ఆ సంఘం నాయకు లు ఘనంగా పూజలు నిర్వహించారు. ఆదిలాబా ద్‌ జిల్లా కేంద్రంలోని వివేకానంద బీఈడీ కళాశా ల ఆవరణలో ఉన్న భీమన్న దేవుని ఆలయంలో పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. 

 నిర్మల్‌, సోన్‌ మండలాల్లోని ఆయా గ్రామాల్లో పోచమ్మ పండుగను నిర్వహించారు. నిర్మల్‌ మండలం అనంతపేట్‌,  నీలాయిపేట్‌, వెంగ్వాపేట్‌, మేడిపెల్లి, రత్నాపూర్‌కాండ్లీ, చిట్యాల్‌, లంగ్డాపూర్‌, సోన్‌ మండలం సోన్‌, మాదాపూర్‌, పాక్‌పట్ల, న్యూవెల్మల్‌, జాఫ్రాపూర్‌, కడ్తాల్‌, గంజాల్‌, తదితర గ్రామాల్లో ప్రజలు పోచమ్మకు మొక్కులు చెల్లించారు. వర్షాలు స మృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని గ్రామ దేవతను వేడుకున్నారు. logo