బుధవారం 12 ఆగస్టు 2020
Adilabad - Jul 11, 2020 , 00:21:09

ఆదర్శ జీపీలుగా తీర్చిదిద్దండి

ఆదర్శ జీపీలుగా తీర్చిదిద్దండి

ఆదిలాబాద్‌ రూరల్‌: మండలంలోని 34 గ్రామపంచాయతీలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఎమ్యె ల్యే జోగు రామన్న పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో ఆదిలాబాద్‌ రూరల్‌ మండల పరిధిలోని గ్రామాల్లో పల్లెప్రగతి పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,   పల్లెలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని పునరుద్ఘాటించారు. రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతిలో భాగంగా నెలనెలా నిధులు మంజూరు చేస్తున్నదని చెప్పారు. హరితహారంలో భాగంగా ప్రజలకు అవసరమైన మొక్కలను గ్రీన్‌బడ్జెట్‌ నుంచి కొనుగోలు చేయవచ్చన్నారు. అలాగే గ్రామాల్లో శ్మశానవాటికలు, డంప్‌ యార్డులు, సెగ్రిగేషన్‌ షెడ్లను నిర్మించాలని పేర్కొన్నారు.

సర్పంచ్‌లు, ఎంపీటీసీలు మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పల్లెల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తున్నదని వివరించారు. గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దిన జీపీలకు డబుల్‌ బెడ్రూం ఇండ్లతోపాటు ఎమ్యెల్యే నిధులు విడుద ల చేస్తామని ప్రకటించారు. అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ మాట్లాడుతూ, నిబంధనల ప్రకారం పనులు చే స్తూ నిధులను వినియోగించుకోవాలన్నారు. పల్లె ల్లో ఆహ్లాద  కల్పించడానికి ప్రభు త్వం పార్క్‌లను ఏర్పాటు చేస్తున్నదన్నారు. సమావేశంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఆరె రాజన్న, ఎంపీపీ సెవ్వ లక్ష్మి, వైస్‌ ఎంపీపీ రమేశ్‌, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, డీఆర్డీవో రాజేశ్వర్‌ రాథోడ్‌, ఎంపీడీవో రాథోడ్‌ రవీందర్‌, తహసీల్దార్‌ మోహన్‌సింగ్‌, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. logo