సోమవారం 03 ఆగస్టు 2020
Adilabad - Jul 08, 2020 , 00:01:42

మున్సిపాలిటీ అభివృద్ధే లక్ష్యం

మున్సిపాలిటీ అభివృద్ధే లక్ష్యం

ఆదిలాబాద్‌ రూరల్‌ : ఆదిలాబాద్‌ మున్సిపాలిటీని అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెట్టడమే తమ లక్ష్యమని ఆదిలాబాద్‌ ఎమ్యెల్యే జోగు రామన్న స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని 3, 5వ వార్డుల్లో రూ.50 లక్షలతో నిర్మించనున్న డ్రైనేజీ, సీసీ రోడ్ల పనులను మంగళవారం భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించి, నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.250 కోట్ల ప్రత్యేక నిధుల(ఎస్‌డీఎఫ్‌)ను తీసుకవచ్చామన్నారు. వరుస ఎన్నికలతో పనులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. ప్రస్తుతం రెండు కాలనీల్లో సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణానికి ప్రత్యేక నిధుల నుంచి కేటాయించామని చెప్పారు. త్వరలోనే కాలనీలో సమస్యలు తీరుతాయన్నారు. ఆదిలాబాద్‌ అభివృద్ధికి ఎన్ని నిధులైనా కేటాయించేందుకు సీఎం కేసీఆర్‌ సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. పట్టణ అభివృద్ధికి కృషిచేస్తామన్నారు. వచ్చే మూడేండ్లలో మరిన్ని నిధులు తీసుకవచ్చి, పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ప్రస్తుతం కరోనా విస్తరిస్తున్నందున పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలన్నారు. అనంతరం కాలనీలో తిరుగుతూ ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పలు మురుగు కాలువలను పరిశీలించి, నూతన డ్రైనేజీలను నిర్మించాలని మున్సిపల్‌ డీఈని ఆదేశించారు. అనంతరం మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధికి ఎన్ని నిధులైనా వెచ్చిస్తామన్నారు. కాలనీల్లోని సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జహీర్‌ రంజాని, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మెట్టు ప్రహ్లాద్‌, కౌన్సిలర్లు నైమున్నీసాబేగం హైమద్‌, సాయి ప్రణీత్‌, పండ్ల శ్రీను, అశోక్‌, సంద నర్సింగ్‌, మున్సిపల్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ రాజు, తదితరులు పాల్గొన్నారు.


logo