సోమవారం 03 ఆగస్టు 2020
Adilabad - Jul 07, 2020 , 23:53:12

మొక్కల పెంపకం సామాజిక బాధ్యత

మొక్కల పెంపకం సామాజిక బాధ్యత

ఆదిలాబాద్‌ రూరల్‌: మొక్కల పెంపకాన్ని సామాజిక బాధ్యతగా గుర్తించాలని డీఐఈవో దస్రూ నాయక్‌ ప్రజలకు సూచించారు. జిల్లా కేంద్రంలోని ఇంటర్‌బోర్డు కార్యాలయ ఆవరణలో మంగళవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కళాశాలలు ప్రారంభమైన వెంటనే జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో హరితహారం కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.  కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

బేల: మొక్కలతోనే పర్యావరణాన్ని రక్షించుకోవచ్చని ఎంపీపీ వనిత ఠాక్రే పేర్కొన్నారు. ఆరో విడుత హరితహారంలో భాగంగా మంగళవారం మండలంలోని కాంగార్‌పూర్‌, మణియార్‌పూర్‌ గ్రామాల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రామాల్లో రైతులు పంచాయతీ కార్యదర్శుల వద్దకు వచ్చి మొక్కలు తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్‌ఠాక్రే, సర్పంచ్‌ వాడ్కర్‌ తేజ్‌రావు, సెక్రటరీ నీతా రాణి, ఏఈవో దీప్తి, ఉపసర్పంచ్‌, గ్రామస్తులు పాల్గొన్నారు. 

ఆదిలాబాద్‌ రూరల్‌: పట్టణంలోని ఖానాపూర్‌లో జోగు మహేందర్‌ ఫ్యాన్స్‌ ఆధ్వర్యంలో యువజన సంఘం సభ్యు లు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాలనీ అభివృద్ధికి జోగు కుటుంబం ఎంతగానో కృషి చేస్తున్నదన్నారు. కాలనీలోని సమస్యలు ఎమ్యెల్యే రామన్న కుమారుడు మహేందర్‌ దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో యువజన సంఘం సభ్యులు వినయ్‌, కృష్ణ, యువకులు రాము, రవి, కిరణ్‌, ఆశవర్కర్లు పాల్గొన్నారు. 

సిరికొండ: మండలంలోని పొన్న గ్రామంలో మంగళవా రం సర్పంచ్‌ చంద్రకళ మొక్కలు నాటారు. కార్యక్రమంలో వార్డు సభ్యుడు విజయ్‌ కుమార్‌, గ్రామస్తులు పాల్గొన్నారు.

బోథ్‌: బోథ్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంతో పాటు పోలీస్‌ స్టేషన్‌లో ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు మొక్కలు నాటారు. అనంతరం సామూహిక మరుగుదొడ్లు, దవాఖానలో వెయిటింగ్‌ షెడ్‌ను ప్రారంభించారు. రైతు వేదిక భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి నరేందర్‌ రాథోడ్‌, సీఐ రవీందర్‌, ఎస్‌ఐ రాజు, డాక్టర్లు ఆనంద్‌, రవీంద్రప్రసాద్‌, ఎంపీపీ  శ్రీనివాస్‌, జడ్పీటీసీ సంధ్యారాణి, ఏఎంసీ చైర్మన్‌ నారాయణ్‌సింగ్‌, టీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ రుక్మణ్‌సింగ్‌, జడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు తాహెర్‌ బిన్‌ సలాం, సర్పంచ్‌ సురేందర్‌యాదవ్‌, సహకార సంఘం చైర్మన్‌ ప్రశాంత్‌, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. logo