సోమవారం 06 జూలై 2020
Adilabad - Jun 30, 2020 , 02:35:56

మొక్కలు నాటడం అందరి బాధ్యత

మొక్కలు నాటడం అందరి బాధ్యత

  •  హరితహారంలో అధికారులు, నాయకులు

నిర్మల్ అర్బన్  : మొక్కలు నాటడం అందరి బాధ్యత అని అగ్నిమాపక శాఖ నిర్మల్ డివిజన్ అధికారి కేశవులు పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని అగ్ని మాపక శాఖ కార్యాలయంలో సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటి ఆవరణలో ఐదు మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫైర్ ఆఫీసర్ మల్లయ్య,  శ్రీనివాస్, రమేశ్, నవీన్, శేఖర్, నగేశ్ తదితరులున్నారు.  

సారంగాపూర్:  మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో మొక్కలు నాటారు. ప్రధానోపాధ్యాయుడు లచ్చన్న,  ఎస్ చైర్మన్ గుజ్జి వెంకటయ్య,  విద్యార్థులు పాల్గొన్నారు.  

భైంసా  : పట్టణంలోని 9, 10, 11, 23 వార్డుల్లో హరితహారంలో భాగంగా కాలనీ వాసులకు మొక్కలు పంపిణీ చేశారు. నాటిన మొక్కలకు నీరు పోసి సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గౌతమ్ పింగ్లె, మున్సిపల్ సిబ్బంది గౌరీశ్, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు. 

లోకేశ్వరం : మండలంలోని 25 గ్రామాల్లో హరితవనాలు ఏర్పాటు చేసేందుకు స్థలాలను ఎంపిక చేయాలని గ్రామ కార్యదర్శులు, సర్పంచులకు ఈజీఎస్ మండల ఏపీవో లక్ష్మారెడ్డి సూచించారు. మండలంలోని రాజురా, మన్మథ్, బాగాపూర్ తదితర గ్రామాల్లోని నర్సరీలను పరిశీలించారు. పంచాయతీ కార్యాలయాలు, వైకుంఠధామాలు, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాలని సూచించారు.  ఆయన వెంట ఈజీఎస్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులున్నారు. logo