గురువారం 03 డిసెంబర్ 2020
Adilabad - Jun 22, 2020 , 03:01:58

నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం

నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం

  • పొరుగు రాష్ర్టాల నుంచి సరఫరా
  • రైతులకు అంటగడుతున్న దళారులు
  • జిల్లా, మండల స్థాయిలో టాస్క్‌ఫోర్స్‌ బృందాలతో తనిఖీలు
  • నిషేధిత గడ్డి ముందు విక్రయాలపై  నిఘా

ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ : ఆదిలాబాద్‌ జిల్లాలో నాలుగు లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తా రు. జూన్‌ మాసం నుంచి విత్తనాలు వేయడం మొ దలు పెడతారు. ఈ క్రమంలో రైతులు వివిధ కంపెనీలకు చెందిన బీటీ-2 పత్తి విత్తనాలను వినియోగిస్తారు. రైతుల అవకాశాలను ఆసరాగా చేసుకుని కొందరు దళారులు నకిలీ విత్తనాలను అంటగడుతున్నారు. బీటీ-3 పత్తి విత్తనాలు విక్రయాలపై నిషేదం ఉన్నా దళారులు రైతులకు అంటగడుతున్నారు. వీటి వినియోగంతో ప్రమాదకరమైన గడ్డి మందులు పత్తి పంటపై వేసినా ప్రమా దం ఉండదనే నమ్మకంతో రైతులు ఈ విత్తనాల వైపు మొగ్గుచూపుతున్నారు. పంటలో కలుపు ఖర్చులు తగ్గడంతోపాటు తక్కువ ధరకు లభ్యమవుతుండటంతో కొనుగోలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, మహరాష్ట్ర నుంచి తీసుకొచ్చి కలర్‌ గౌచో ట్రీట్‌మెంట్‌(విత్తనాలకు పాలీష్‌ వేయ డం) చేస్తారు. ఈ విత్తనాలు బీటీ విత్తనాల మాదిరిగా కనపడటమే కాకుండా 45 రోజులపాటు పత్తి మొక్కలు ఏపుగా పెరిగేలా ట్రీట్‌మెంట్‌లో భాగం గా మందులు వినియోగిస్తుంటారు.

టాస్క్‌ఫోర్స్‌ బృందాల తనిఖీలు

నకిలీ విత్తనాల నివారణ కోసం అధికారులు టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లా, మండల స్థాయిలో బృందాలు పనిచేస్తాయి. జిల్లాలో డీఎస్పీ, వ్యవసాయ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌లు సభ్యులుగా ఉంటారు. మండల స్థాయిలో ఎస్సై, మండల వ్యవసాయధికారి, తహసీల్దార్‌లు ఉంటారు. తనిఖీ బృందాలు విత్తనాలు, దుకాణాలతోపాటు గ్రామాలు, మండల, జిల్లా కేంద్రాల్లో అనుమానం ఉన్న ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తాయి. కోరియర్‌ సర్వీసులు, జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతారు. జిల్లాలో ఇప్ప టి వరకు 600 కిలోల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి ధర దాదాపు రూ.7లక్షలకుపైగా ఉంటుంది. 

నిషేధిత గడ్డి మందుపై నిఘా

జిల్లాలో నిషేధిత గడ్డి మందు ైగ్లెఫోసెట్‌ విక్రయాలపై టాస్క్‌ఫోర్స్‌ బృందాలు నిఘా సాగించాయి. నిషేధించిన కలుపు మందును పత్తి పంటలో వా డుతుంటారు. ప్రమాదకరమైన కలపు నివారణ మందులు వాడటంతో భూసారం దెబ్బతినడంతోపాటు భూమి శక్తిని కోల్పోయి దిగుబడి రాదు. పంటలో చీడ పురుగులు తినే మిత్ర పురుగులు కూడా చనిపోతాయి. ఈ విత్తనాలతో పత్తి సాగు చేసిన ఇతర పంటలపై కూడా ప్రభావం ఉం టుం ది. వేరే పంటల దిగుబడులు సరిగా రావని అధికారులు అంటున్నారు. మహరాష్ట్ర నుంచి ఈ కలుపు మందు ఎక్కువగా సరఫరా అవుతుంది. నార్నూర్‌లో ఇటీవల 400 ైగ్లెఫోసెట్‌ బాటిళ్లను పట్టుకున్నారు. 

విస్తృతంగా తనిఖీలు..

నకిలీ విత్తనాల నివారణలో భాగంగా జిల్లా, మండల స్థాయిలో విస్తృంతగా తని ఖీలు నిర్వహిస్తున్నాం. నకిలీ విత్తనాల విషయం లో రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. నకిలీ విత్తనాలు విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. నిషేధిత కలుపు మందు గ్రైఫోసెట్‌ విక్రయాలు జరుగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగింది. రైతు లు టాస్క్‌ఫోర్స్‌ అధికారులకు నకిలీ విత్తనాలకు సంబధించిన సమాచారం ఇవ్వాలి. 

- రమేశ్‌, జిల్లా టాస్క్‌ఫోర్స్‌ అధికారి