శుక్రవారం 03 జూలై 2020
Adilabad - Jun 05, 2020 , 03:40:04

ఉట్నూర్‌లో తొమ్మిది మందికి కరోనా పాజిటివ్‌

 ఉట్నూర్‌లో తొమ్మిది మందికి కరోనా పాజిటివ్‌

  • ముంబయి నుంచి ఆదిలాబాద్‌కు రాక
  • 43 రోజుల తర్వాత పాజిటివ్‌
  • ఉట్నూర్‌లో దుకాణాల మూసివేత

ఉట్నూర్‌లో కరోనా అలజడి ప్రారంభమైంది. జిల్లాలో మర్కజ్‌ కేసుల తర్వాత ముంబయి నుంచి సొంత గ్రామానికి చేరుకున్న తొమ్మిది మంది వలస కార్మికులకు పాజిటివ్‌ వచ్చింది. 43 రోజుల తర్వాత నిర్ధారణ కావడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ప్రజలు బయట తిరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. 

ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ/ ఉట్నూర్‌: ఆదిలాబాద్‌ జిల్లాలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతు న్నాయి. జిల్లా నుంచి మర్కజ్‌ ప్రార్థనలకు, ఉపా ధి కోసం ముంబైకి వెళ్లొచ్చిన వారికి కరోనా సోకిం ది. జిల్లా నుంచి మర్కజ్‌ ప్రార్థనలకు 76 మంది పోగా ఏప్రిల్‌ 1న వీరిని గుర్తించిన అధికారులు రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. ఏప్రిల్‌ 4న వచ్చే నివేదికలో 10 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఇందులో ఆదిలాబాద్‌కు చెంది న ఆరుగురు, నేర డిగొండ వాసులు ముగ్గురు, ఉట్నూర్‌ మండలం హస్నాపూర్‌కు చెందిన ఓ వ్యక్తి ఉన్నారు. వీరిని మెరుగైన వైద్యం కోసం గాంధీకి తరలించారు. వీరితో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లో ఉన్న 437 మంది రక్త నమునాలు సేకరించిన అధికారులు పరీక్షలకు పంపగా అందు లో 11 మందికి పాజిటి వ్‌ వచ్చింది. ఇందులో ఐదేళ్ల చిన్నారితోపాటు 80 ఏళ్ల వృద్ధురాలు ఉంది. వీరిని అధికారులు గాంధీకి తరలించారు. మర్కజ్‌ కు సంబంధించి 21 కేసు లు నమోదవగా గాంధీ లో చికిత్స అనంతరం అందరూ కోలుకున్నారు. దీంతో జిల్లాలో కొన్ని రోజులుగా కరోనా యాక్టీవ్‌ పాజిటివ్‌ కేసులు లేకుండా పోయాయి.

ఉట్నూర్‌లో తొమ్మిది మందికి 

జిల్లాలో ఏప్రిల్‌ 21న చివరి కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కాగా, అప్పటి నుంచి కేసులు లేవు. లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి పనుల కోసం ఇతర రాష్ర్టాల్లో నివాసమున్న వారు ఇటీవల తమ సొం త గ్రామాలకు చేరుకుంటున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాకు 2,239 మంది ఇతర రాష్ర్టాల నుంచి వచ్చారు. వారికి రాష్ట్ర సరిహద్దుల్లో పరీక్షలు నిర్వ హించిన అధికారులు 12 రోజుల క్వారంటైన్‌ ముద్ర వేశారు. వీరిలో ఇప్పటికే 1,400 మంది హోం క్వారంటైన్‌ పూర్తి చేసుకున్నారు. ఉట్నూర్‌ శాంతినగర్‌కు చెందిన కొందరు ముంబైలో కూలీ పనులు చేస్తున్న 21 మంది తిరిగి వచ్చారు. వారి రక్త నమునాలు సేకరించిన వైద్యులు కరోనా పరీక్షలకు పంపారు. వీరిలో తొమ్మిది మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వైద్య సిబ్బంది వీరిని ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించారు.

పకడ్బందీ ఏర్పాట్లు

జిల్లాలో తొమ్మిది కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఉట్నూర్‌లో దుకాణాలను ఐదు రోజులపాటు మూసివేస్తున్నామని ప్రజలు ఎవరూ బయట తిరగొద్దని అధికారులు సూచిం చారు. పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వ హిస్తున్నారు. శాంతినగర్‌లో సోడియం హైపో క్లోరై ట్‌ పిచికారీ చేశారు. పాజిటివ్‌ వచ్చిన వారితో ప్రైమరీ కాంటాక్టులో ఉన్న వారి రక్త నమూనాలను సేకరించి పరీక్షలకు పంపుతున్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళ నకు గురికావద్దని, సూచనలు పాటించాలని అధికారులు కోరుతున్నారు. 


logo