బుధవారం 08 జూలై 2020
Adilabad - Jun 05, 2020 , 03:36:47

పరీక్షా కేంద్రాలకు ‘సోడియం హైపోక్లోరైట్‌'తో రక్షణ

పరీక్షా కేంద్రాలకు ‘సోడియం హైపోక్లోరైట్‌'తో రక్షణ

ఆదిలాబాద్‌ రూరల్‌/  నిర్మల్‌ అర్బన్‌ : కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లోని పదో తరగతి పరీక్షా కేంద్రాల్లోని గదులు, ఆవరణ, ఫర్నీచర్‌ను  సోడియం హైపో క్లోరైట్‌ ద్రావణంతో శుభ్రం చేస్తున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌, తిరుపెల్లి ప్రభుత్వ పాఠశాలల్లో సోడి యం హైపో క్లోరైట్‌ ద్రావణాన్ని మున్సిపల్‌ సిబ్బంది గురువారం పిచికారీ చేశారు. కేంద్రాల వద్ద శానిటైజర్లు, మాస్కులతో పాటు, సిబ్బంది కోసం గ్లౌజ్‌లు అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. నిర్మల్‌ పట్టణంలోని సోఫీనగర్‌ కేజీబీవీ పాఠశాలలోని గదులు, ఆవరణను  సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణంతో పిచికారీ చేశారు. 

ఉట్నూర్‌ రూరల్‌ : మండలంలోని లక్షటిపేట్‌ గ్రామంలోని ఆశ్రమ వసతిగృహంలో గురువారం సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు. పదో తరగతి పరీక్షల నేపథ్యంలో తరగతి గదులను శుభ్రం చేయిస్తున్నామని సర్పంచ్‌ శ్యామ్‌రావు, పంచాయతీ కార్యదర్శి సురేందర్‌ తెలిపారు. 

లక్ష్మణచాంద : పదో తరగతి పరీక్షల నిర్వహణ దృష్ట్యా లక్ష్మణచాందలోని బీసీ వసతిగృహంలోని గదులను  సోడియం హైపో క్లోరైట్‌ ద్రావణంతో పిచికారీ చేయించినట్లు సర్పంచ్‌ సురకంటి ముత్యంరెడ్డి తెలిపారు.  ఈ వసతి గృహం నుంచి 18 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. 


logo