సోమవారం 06 జూలై 2020
Adilabad - Jun 04, 2020 , 01:47:00

కాళేశ్వరం కాలువకు సోలార్‌ అడ్డంకి

కాళేశ్వరం కాలువకు సోలార్‌ అడ్డంకి

ఒకే భూమిని అటు సర్కారుకు, ఇటు సోలార్‌కు విక్రయించిన వైనం

నాలుగు ఎకరాల భూమి తమదంటే తమదని మొదలైన వివాదం

ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన నిర్మల్‌ అదనపు కలెక్టర్‌ భాస్కర్‌ రావు

విక్రయించినవారు, అప్పటి అధికారులపై చర్యలు తీసుకోవాలని నివేదిక

నిర్మల్‌, నమస్తే తెలంగాణ: నిర్మల్‌ జిల్లా ముథో ల్‌ నియోజకవర్గంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 28 ద్వారా 50 వేల ఎకరాలకు సాగునీరు అందిం చే పనులు చేపట్టారు. ఇందులో భాగంగా కాలువల తవ్వకం కోసం భూములను సేకరించి రైతులకు నష్టపరిహారం చెల్లిస్తున్నారు. ముథోల్‌ మండలంలో కాళేశ్వరం ప్యాకేజీ 28 కుడి ప్రధాన కాలువ కోసం 36.076 ఎకరాల భూమిని సేకరించారు. ఇందుకు సంబంధించి 2016లోనే భూసేకరణ చేశారు. అవార్డు మెంబరు 13/ 2015-16, తేది.18.3.2016 ప్రకారం సేకరించిన భూములకు నష్టపరిహారం చెల్లించారు. సర్వే నంబరు 62,82లో 5.22 గుంటల భూమిని సేకరించగా.. ఇందుకు సంబంధించిన పరిహారం డ బ్బులను జూన్‌ 2016లో ఆన్‌లైన్‌ పేమెంట్‌ చేశా రు. నష్టపరిహారం డబ్బులను ఇద్దరు పట్టాదారుల  ఖాతాల్లోకి రూ.8,32,132, రూ.2,59,201 పంపారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం తీసుకున్నాక ఇదే భూమిని వాయుదుత్‌ సోలార్‌పర్మ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు రిజిస్ట్రేషన్‌ డ్యా క్యుమెంట్‌ నంబరు 2503 తేది. 6.7.2016న భైంసా రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేశారు. సదరు సోలార్‌ కంపెనీవారు ఈ భూములను అమలు చేసుకొని (మ్యుటేషన్‌) నాలా కన్వర్షన్‌ (నాన్‌ అగ్రికల్చర్‌ ల్యాండ్‌) కోసం దరఖాస్తు చేసుకున్నా రు. దీంతో అప్ప టి ముథోల్‌ తహసీల్దార్‌ ఎల్‌ఆర్‌ నంబరు డీ/146/2015  తేది 9.12.2016న ఆర్డీవోకు నాలా కన్వర్షన్‌ కోసం ప్రతిపాదనలు పంపారు. అప్పటి భైంసా ఆర్డీవో ప్రొసిడింగ్‌ నం బరు డీ/ 61/2016-2 ప్రకారం నాలా కన్వర్షన్‌ అనుమతులు ఇచ్చారు. సర్వే నంబరు 62, 82 లోని నాలుగు ఎకరాల భూమి సదరు సోలార్‌ప్లాంట్‌ వారి ప్రహరీలోపల ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 28 కుడి ప్రధాన కాలువ 2.505 కిలోమీటర్ల నుంచి 3.650 మధ్య తవ్వాల్సిన భూములు సదరు సోలార్‌ ప్రహరీలోకి వెళ్లిపోయాయి. ఇరిగేషన్‌ అధికారులు 2017 ఏప్రిల్‌ 19న రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. ఈ భూమిని అప్పగించారని రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చిన, ఎన్నిసార్లు చెప్పిన సోలార్‌ప్లాంట్‌ నుంచి స్పందన లేదు. ఇటీవల ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్డీ  శ్రీధర్‌రావు దేశ్‌పాండే పర్యటనలో ఈ విషయం చర్చకు వచ్చింది. దీం తో విచారణ చేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు ను ఆదేశించారు. విచారణ చేసిన అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు కాలువ తవ్వకం కోసం ప్రభుత్వం సేకరించిన నష్టపరిహారం తీసుకున్నాక మళ్లీ సోలార్‌ప్లాంట్‌ వారి కి విక్రయించారని గుర్తించారు. ఈ వ్యవహారంలో అప్పటి తహసీల్దార్‌ సిడాం దత్తు, ఆర్డీవోలు నిజానిజాలు క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా నిర్లక్ష్యంగా చేశారని గుర్తించారు. 

భూసేకరణ సమయంలో, సోలార్‌ప్లాంట్‌కు.. 

భూముల మ్యూటేషన్‌, నలా కన్వర్షన్‌ పంపిన సమయంలో ఒకరే తహసీల్దార్‌ ఉన్నారని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా గుడ్డిగా నాలా కన్వర్షన్‌ కోసం ప్రతిపాదనలు ఆర్డీవోకు పంపారని ఆ నివేదికలో పేర్కొన్నారు. అప్పటి భైంసా ఆర్డీవో కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి విచారణ, సర్వే చేయకుండానే నాలా కన్వర్షన్‌ ఉత్తర్వులు ఇచ్చారని నివేదికలో రాశారు. సర్వే నంబరు 62,82 పట్టాదారులు కూడా ప్రభుత్వం నుంచి పరిహారం పొందాక వాయుదూత్‌ సోలార్‌పర్మ్‌ విక్రయించి ప్రభుత్వాన్ని మోసం చేశారని పేర్కొన్నారు. ప్రధా న కాలువ పనులు నిలిచిపోవడానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని నివేదించారు. అప్ప టి ముథోల్‌ తహసీల్దార్‌ సిడాం దత్తు, భైంసా ఆర్డీ వో పూర్తి వాస్తవాలు తెలుసుకోకుండానే సమ గ్ర క్షేత్రస్థాయిలో విచారణ చేయకుండానే రెవె న్యూ రికార్డులో మ్యుటేషన్‌, నాలా కన్వర్షన్‌ ఉత్తర్వులు ఇచ్చినవారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వాన్ని మోసం చేసిన పట్టాదారులు పై కేసులు నమోదు చేయాలని నివేదికలో పేర్కొన్నారు. 


logo