ఆదివారం 12 జూలై 2020
Adilabad - Jun 03, 2020 , 01:06:31

ఆరేండ్లలో అద్భుతమైన ప్రగతి సాధించాం..

ఆరేండ్లలో అద్భుతమైన ప్రగతి సాధించాం..

దేశంలోనే అత్యధికంగా ధాన్యం పండించిన రాష్ట్రం మనదే.. 

తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో  మంత్రి అల్లోల

నిర్మల్‌, నమస్తే తెలంగాణ : తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్‌ సారథ్యంలో గడిచిన ఆరేండ్లలో అన్ని రంగాల్లో పురోగమించి, దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా మంగళవారం కలెక్టర్‌ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి అల్లోల పాల్గొన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేసి అక్కడి నుంచి ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్‌ విగ్రహానికి, కొండా లక్ష్మణ్‌బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం కలెక్టరేట్‌లో అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు.

అనంతరం అక్కడే జ్యోతి ప్రజ్వలన చేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమరవీరుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సారథ్యంలో ప్రగతి పథంలో దూసుకుపోతుందన్నారు. ఆరేండ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది, దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. పేద, బడుగు, బలహీన వర్గా ల అభ్యున్నతికి ఎనలేని కృషి చేస్తుందన్నారు. రైతుల సంక్షేమం, ఆర్థిక పురోభివృద్ధికి అనే క పథకాలు అమలు చేస్తుందన్నారు. రైతుల కు ఉచితంగా 24 గంటల విద్యుత్‌ సరఫరా, రైతుబంధు, రైతుబీమా, విత్తనాలు, ఎరువుల సరఫ రా, కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యం సేకరిస్తుందన్నారు. ఎఫ్‌సీఐకి 83 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం అవసరం ఉంటే అం దులో సింహభాగం తెలంగాణ రాష్ట్రం 53 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పండించిందన్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కజొన్న, ధాన్యం సాగు చేయడంతో భారీగా దిగుబడి వచ్చిందన్నారు. సీఎం కృషి వల్లే ఇదంతా జరిగిందన్నారు.

నిర్మల్‌ అన్ని రంగాల్లో అభివృద్ధి

రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన నిర్మల్‌ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు చేశామన్నారు. 10 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మెదక్‌ జిల్లాకు పంపించామన్నారు. తుఫాన్‌ ప్రభావం  ఉన్నప్పటికి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వరి ధాన్యాన్ని జూన్‌ 8 వరకు కొనుగోలు చేస్తామని తెలిపారు. నిర్మల్‌ జిల్లా కేంద్రానికి నలుదిక్కుల స్వాగత తోరణాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రజల సహకారంతోనే కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా నియంత్రించ గలిగామని, ఈ మహమ్మారిని అరికట్టడంలో వై ద్య, పోలీసు, రెవెన్యూ, మున్సిపల్‌, ఆశ వర్కర్లు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు రేయింబవళ్లు కష్టపడ్డారని, వారి సేవలు మరువలేనివని తెలిపుతూ కృతజ్ఞతలు తెలిపారు.

కరోనా మహమ్మారితో సహజీవనం చేయాల్సిన పరిస్థితి నెలకొందని, అందుకు అనుగుణంగా ప్రజలంతా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ మా స్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఈ సందర్భంగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి చేతుల మీదుగా తెలంగాణ మాసపత్రిక రాష్ట్ర అవతరణ దినోత్సవం ప్రత్యేక సంచిక(జూన్‌ మాసం)ను ఆవిష్కరించి ప్రజాప్రతినిధులకు, జిల్లా అధికారులకు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ కొరిపెల్లి విజయలక్ష్మి, కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ, మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఎర్రవోతు రాజేందర్‌రాజేందర్‌, ఎస్పీ శశిధర్‌రాజు, అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు, టీఆర్‌ఎస్‌ నాయకులు రాంకిషన్‌రెడ్డి, అల్లోల మురళీధర్‌రెడ్డిలు పాల్గొన్నారు.


logo