సోమవారం 13 జూలై 2020
Adilabad - May 24, 2020 , 23:48:36

జోరుగా ధాన్యం కొనుగోళ్లు

జోరుగా ధాన్యం కొనుగోళ్లు

దహెగాం: యాసంగిలో మండలంలో ధాన్యం కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆరు కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమున్న సౌకర్యాలు కల్పించారు. అంతేగాక కొవిడ్‌-19 నిబంధనలు అమలు చేస్తున్నారు. మండలంలో ఇప్పటి వరకు 43,841 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేయగా దాదాపు రైతులందరి ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. దహెగాంలో 98 మంది రైతుల నుంచి 7,190 క్వింటాళ్లు, లగ్గాంలో 157 మంది నుంచి 9,492, కొంచవెల్లిలో 157 మంది నుంచి 9,049, చంద్రపల్లిలో 19 మంది నుంచి 899, ఒడ్డుగూడలో 201 మంది నుంచి 7,643, గిరివెల్లిలో 263 మంది నుంచి 9,568 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు ఆయా కేంద్రాల నిర్వాహకులు, అధికారులు తెలిపారు. ఇంకా కొనుగోలు ప్రక్రియ సాగుతుంది.

చాలా సౌకర్యంగా ఉంది

ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతులకు చాలా సౌకర్యంగా ఉంది. నేను దహెగాం కొనుగోలు కేంద్రంలో 220 క్వింటాళ్ల వడ్లను అమ్మినను. డబ్బులు కూడా నా బ్యాంకు ఖాతాలో పడుతాయి. అందుకు అవసరమున్న అన్ని పేపర్లు ఇచ్చాను.

      -అజ్మీర రాజ్‌కుమర్‌, రైతు, మర్రిపల్లి

ప్రతి గింజనూ కొంటాం

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తెచ్చి మద్దతు ధర పొందాలి. కొనుగోలు కేంద్రంలో తూకంతో పాటు ధాన్యాన్ని తరలించే వరకు అవసరమున్న అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. అదే విధంగా ప్రతి రోజు అధికారులతో మాట్లాడి రైతుల ఖాతాల్లో డబ్బులు పడే విధంగా చూస్తున్నాం.  

   -కొండ్ర తిరుపతిగౌడ్‌, సింగిల్‌విండో చైర్మన్‌, దహెగాం


logo