శనివారం 06 జూన్ 2020
Adilabad - May 24, 2020 , 00:10:44

నియంత్రిత సాగే మేలు

నియంత్రిత సాగే మేలు

 పంటల విధానంలో మార్పు తీసుకురావాలి..

రైతు సంక్షేమానికి పెద్దపీట

అవగాహన సదస్సులో మంత్రి అల్లోల

నిర్మల్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వం ఈ వాన కాలం నుంచే సాగు విధానంలో మార్పులు తీసుకొచ్చేందుకే ని యంత్రిత విధానాన్ని అమలు చేస్తుందని రాష్ట్ర అటవీ, పర్యావ రణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడించారు. నిర్మల్‌ పట్టణంలోని దివ్య గార్డెన్‌లో వ్యవసా యశాఖ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులకు నియం త్రిత పంటల విధానం ఆవశ్యకతపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం రైతుబంధుకు ఎకరానికి రూ.5 వేల చొ ప్పున పెట్టుబడి సాయం అందిస్తుందన్నారు. ఇక నుంచి ప్ర భుత్వం చెప్పిన పంటలు వేసుకుంటేనే రైతుబంధు పథకానికి నిధులు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించినందున ఆ దిశగా రైతులను చైతన్యం చేయాలని సూచించారు. మన వద్ద చాలా మంది రైతులు ఒకే రకమైన పంటలు వేసుకోవడం వల్ల ఇబ్బందులు కలగడం, మార్కెట్లో గిట్టుబాటు ధర లభించక పోయినప్పటికీ ప్రభుత్వం రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో పంట కొనుగోళ్లను పెద్ద ఎత్తున చేపడుతుందన్నారు. ఈసారి ని ర్మల్‌ జిల్లాలో వ్యవసాయశాఖ అధికారులు సూచించిన పంట లు వేసుకొని ప్రతి రైతు రైతుబంధు పథకాన్ని వినియోగించు కోవాలని కోరారు. జిల్లాలో ప్రధానంగా పత్తి, మక్కజొన్న, పసుపు, కందులు, జొన్న, సోయా ఆహార పంటలు సాగు చే స్తారని.. వానకాలంలో సోయా, మక్క తగ్గించాలని సూచించా రు. ముఖ్యంగా పప్పు దినుసుల పంటలతోపాటు కందులు, పత్తి పంట విస్తీర్ణం పెంచుకోవాలని సూచించారు. పత్తి పం ట ను భారత ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతులకు తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడి సాయం తోపాటు 24 గంటల కరంటు, సాగు నీటి ప్రాజెక్టులు, మిషన్‌ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టడం వల్ల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని తెలిపారు. 

కోటి ఎకరాలకు సాగు నీరు అందుతుంది.. 

తెలంగాణ రాష్ట్రంలో గోదావరిపై వివిధ బ్యారేజీలు ని ర్మించడం వల్ల రాబోయే కాలంలో కోటి ఎకరాలకు నీరు అందు తుందని మంత్రి తెలిపారు. శ్రీరాంసాగర్‌లో కాళేశ్వరం నీటిని తీసుకొచ్చి నిర్మల్‌ జిల్లాలోని లక్ష ఎకరాలకు సాగునీరు అం దిస్తామని తెలిపారు. నిర్మల్‌ జిల్లాలో ఈసారి పెద్ద మొత్తంలో వరి, మక్కజొన్న పంటలు పండటంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోళ్లను చేపడుతుందన్నారు. గోదాములు, కూలీల కొరత కారణంగా పంట తరలింపులో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున గోదాములను నిర్మించిందన్నారు. రాబోయే కాలంలో శీతల గిడ్డంగులను కూడా నిర్మిస్తామన్నారు. వ్యవసాయశాఖ పరిధిలో రైతు వేదికల నిర్మాణాన్ని వచ్చే ఏడాదిలోపు పూర్తి చేస్తామన్నారు. వ్యవసాయశాఖ అధికారులు జిల్లాలో అన్ని క్లస్టర్ల పరధిలో సమావేశాలు నిర్వహించుకొని ఏ ప్రాంతంలో ఏ రైతు ఎంత విస్తీర్ణంలో సాగు చేసుకోవాలో నిర్ణయించుకొని ఆ వివరాలను పక్కగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు.

రాజకీయ ఉనికి కోసమే విమర్శలు

తెలంగాణ ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తూ పండిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంటే కొందరు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ప్రభుత్వం, అధికారుల తీరుపై విమర్శలు చేయడం తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడాని కేనని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మల్‌ జిల్లాలో ఓ ప్రజాప్రతినిధి రైతు సమస్యల కోసం పోరా డుతున్నట్లు ధర్నాలు నిర్వహించడం సిగ్గు చేటన్నారు. రైతుల సంక్షేమానికి వారి హయాంలో ఒక్క మంచి పని కూడా చేయలే దని విమర్శించారు. అటువంటి  నాయకులు విమర్శిస్తే ఊరుకు నేది లేదని హెచ్చరించారు. రైతులకు కష్టాలు తెలియద ని ఆ కష్టాలను ప్రభుత్వం గుర్తించడం వల్లనే రైతులు కేసీఆర్‌ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటే కాంగ్రెస్‌ నాయకులు మాత్రం కళ్లుం డి చూడలేక ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు.  కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ, ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, రైతు బందు స మితి జిల్లా అధ్యక్షుడు నల్లా వెంకట్రామ్‌రెడ్డి ఉన్నారు.

రూ. 8 కోట్లతో చెక్‌ డ్యామ్‌ పనులకు శంకుస్థాపన 

సారంగాపూర్‌ : మండలంలోని యాకర్‌పల్లి, మల్లక్‌చించోలి గ్రామాల్లో రూ.8 కోట్లతో చెక్‌డ్యామ్‌ నిర్మాణ పనులకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడారు. చెక్‌డ్యామ్‌ల నిర్మాణంతో భూగర్భ జలాలు పెరిగి, రైతులకు మేలు జరుగుతుందన్నారు. అలాగే పశువుల తాగునీటి కోసమే కాకుండా మత్స్యకారులకు జీవనాధారంగా ఉపయోగపడుతాయని చెప్పారు. నిర్మల్‌ జిల్లా వ్యాప్తంగా 12 చెక్‌డ్యామ్‌లు మంజూరు చేయించామని, ఇందులో సారంగాపూర్‌ మండలానికి ఏకంగా ఐదు చెక్‌డ్యామ్‌లు మంజూరైనట్లు వెల్లడించారు. హైలెవల్‌ కెనాల్‌ 27వ ప్యాకేజీ పనులు పూర్తయితే నీరు పుష్కలంగా ఉండి, చెరువులు నీటితో కళకళలాడుతాయన్నారు. ఇరిగేషన్‌ ఎస్సీ సుశీల్‌కుమార్‌, ఆర్డీవో ప్రసునాంబ, ఎంపీపీ అట్ల మహిపాల్‌రెడ్డి, జ డ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, జిల్లా రైతు బంధు సమితి కో ఆర్డినేటర్‌ నల్లా వెంకట్‌రాంరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్‌ ఐర నారాయణరెడ్డి, సర్పంచ్‌ రమణ, టీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ మాదవరా వు, ఎంపీటీసీ రాజు, తహసీల్దార్‌ తుకారం, ఎంపీడీవో సరోజ, నాయకులు రాజ్‌మహ్మద్‌, రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రాంకిషన్‌రెడ్డి, భోజన్న, మల్లేశ్‌, మాణిక్‌రెడ్డి, పాల్గొన్నారు.

నిర్మల్‌ టౌన్‌:  పట్టణంలో ప్రతి వానకాలంలో ఇబ్బందులకు గురి చేస్తున్న జౌలినాలా శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు.  నిర్మల్‌ పట్టణంలోని కురన్నపేట్‌, శేక్‌సౌపేట్‌,  బ్రహ్మపురి కాలనీలో ఉన్న జౌలినాల పూడిక పనులను మంత్రి అల్లోల పరిశీలించారు. పాదయాత్ర గా కాలువ గట్టుపై నుంచి వెళ్లి ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.  మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌,  ఎఫ్‌ఎసీఎస్‌ చైర్మన్‌ ధర్మాజీగారి రాజేందర్‌, ఎఫ్‌ఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ రాంకిషన్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ బా లకృష్ణ, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ ఎర్రవోతు రాజేందర్‌, ఉన్నారు. 

సోన్‌: నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని దివ్యనగర్‌లోని మున్సిపల్‌ పార్కును  మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి శనివారం సాయంత్రం పరి శీలించారు. మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.


logo