శనివారం 06 జూన్ 2020
Adilabad - May 21, 2020 , 23:15:01

సంరక్షణ.. సన్నద్ధం

సంరక్షణ.. సన్నద్ధం

జూన్‌ 8 నుంచి ‘పది’ పరీక్షలు

కొవిడ్‌-19 నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు

ఓవైపు కరోనా నివారణ.. మరో వైపు ఎగ్జామ్స్‌  

ఉమ్మడి జిల్లాలో అదనంగా 135 సెంటర్లు   

పాత హాల్‌టికెట్లతోనే పరీక్షలు.. 

లాక్‌డౌన్‌తో నిలిచిపోయిన పదో తరగతి పరీక్షలు జూన్‌ 8 నుంచి మళ్లీ మొదలు కాబోతున్నాయి. కరోనా నేపథ్యంలో ‘సంరక్షణ..సన్నద్ధం’ అన్నట్లుగా ఏర్పాట్లు సాగుతున్నాయి. అన్ని జిల్లాల్లో విద్యార్థులు భౌతిక దూరం పాటించేందుకు యంత్రాంగం అదనంగా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. ఇదే సమయంలో విద్యార్థులకు సమాచారం చేరవేయడంతోపాటు వైరస్‌ కట్టడికి చర్యలు చేపడుతున్నది. పాత, కొత్త కేంద్రాలను పూర్తి స్థాయిలో శానిటైజేషన్‌ చేయడంతో పాటు ఎలాంటి ఇబ్బందులూ రాకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నది.

- కరీంనగర్‌ ప్రతినిధి,నమస్తే తెలంగాణ

కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: 2019-20 విద్యా సంవత్సరంలో భాగం గా గత మార్చి 19న పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. నిబంధల ప్రకారం ఏప్రిల్‌ 8 వరకు జరగాల్సి ఉంది. మార్చి 21న హిందీ పరీక్ష ముగియగానే.. కొవి డ్‌-19 నేపథ్యంలో పరీక్షలు వాయిదా పడ్డా యి. మిగిలిన పరీక్షలను నిర్వహించడానికి వీలు లేకుండా పోయింది. వరుసగా లాక్‌డౌన్‌ పొడిగించడం.. కరోనా బాధితులు పెరుగుతూ వస్తున్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణ వాయి దా పడుతూ వచ్చింది. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వచ్చిన నేపథ్యంలో.. పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం హైకోర్టును కోరగా.. జూన్‌ 8 నుంచి నిర్వహించుకోడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇం దుకోసం కొన్ని షరతులను విధించింది. కోర్టు ఆదేశాల ప్రకారం పరీక్షలు నిర్వహించడానికి అధికాయంత్రాగం సిద్ధమవుతున్నది.

భారీగా పెరిగిన కేంద్రాలు.. 

కరోనా నియంత్రణ నేపథ్యంలో పరీక్షా కేం ద్రాలను దాదాపు రెట్టింపు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మొదట 190 పరీక్షా కేం ద్రాలుండగా, అదనంగా 135 కేంద్రాలను పెం చారు. విద్యార్థికీ విద్యార్థికి మధ్య చాలా భౌతిక దూరం ఉండేందుకు కేంద్రాల సంఖ్యను పెం చారు. గతంలో పరీక్ష రాసిన కేంద్రాలకు సమీపంలోనే కొత్త కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీని ద్వారా విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఇబ్బందులు ఏర్పడకుండా ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. ఇదే సమయంలో.. పాత హాల్‌టికెట్లతో పరీక్షలు జరుపుతామని అధికారులు ఇప్పటికే స్పష్టం చేసినందున ఇబ్బంది ఉండదు. అయితే హైకోర్టు సూచనల మేరకు పరీక్ష.. పరీక్షకు మధ్య రెండు రోజులు గడువు ఉండాలి. ఈ లెక్కన జూన్‌ 8న పరీక్షలు ప్రారంభమై.. పూర్తి కావడానికి సెలవులతో కలి పి సుమారు 25 రోజులు పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే పరీక్షకు ముందు.. పరీక్ష తదుపరి శానిటైజేషన్‌ చేయడంతో పాటు అవసరమైన థర్మల్‌ స్క్రీనింగ్‌ కిట్టులు, తగినంత వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు.logo