సోమవారం 25 మే 2020
Adilabad - Apr 01, 2020 , 02:00:12

స్వీయ నియంత్రణ స్ఫూర్తిదాయకం

స్వీయ నియంత్రణ స్ఫూర్తిదాయకం

నమస్తే తెలంగాణ యంత్రాంగం: కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను ప్రజలు గౌరవిస్తూ స్వీయనియంత్రణ పాటిస్తున్నారు. ఆదిలాబాద్‌, నిర్మల్‌, కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో ప్రజలు నిబంధనలు పాటిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. మంగళవారం 

తొమ్మిదో రోజూ ప్రజా రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. 

కామారెడ్డి జిల్లాలో 

కామారెడ్డి పట్టణంలోని ప్రధాన చౌరస్తాలు, ర హదారులు బోసిపోయి కనిపించాయి. ఉద యం 6 గంటల నుంచి 2 గంటల వరకు కూరగాయలు, కిరాణాషాపుల్లో నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించారు.  రాజంపేట మండలంలోని కొండాపూర్‌లో విదేశాల నుంచి వచ్చిన వారికి వైద్యులు అవగాహన కల్పించారు. దోమకొండ మండల కేంద్రంలో మైకుల ద్వారా కరోనా వైరస్‌ నియంత్రణపై అవగాహన కల్పించారు. మాచారెడ్డి మండలంలోని గజ్యానాయక్‌తండాలో సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పోలీసులకు మాస్కులు పంపిణీ చేశా రు. బీబీపేట మండల కేంద్రంలోని ఆంధ్రాబ్యాంకు వద్ద డబ్బుల కోసం వచ్చిన ఖాతాదారులు సామాజిక దూరం పాటించకపోవడంతో గందరగోళం నెలకొన్నది. బిచ్కుంద ఎంపీపీ అశోక్‌ పటేల్‌ ఆధ్వర్యంలో మండలస్థాయి స మావేశం నిర్వహించి లాక్‌డౌన్‌పై చర్చించారు. బిచ్కుందలోని 30 పడకల దవాఖానను అధికారులు పరిశీలించారు. పిట్లం మండల కేంద్రంతోపాటు చిల్లర్గిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి వైద్యాధికారి క్వారంటైన్‌ స్టాంపులను వేశారు.  

నిర్మల్‌ జిల్లాలో..

నిర్మల్‌ జిల్లా కేంద్రంలో పోలీసులు లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. జాతీయ రహదారులపై బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను నియంత్రించారు. దస్తురాబాద్‌ మండలంలో విదేశాల నుంచి వచ్చిన వా రికి వైద్య సిబ్బంది క్వారంటైన్‌ స్టాంపులు వేశా రు. కుంటాల మండలంలో ప్రజలు స్వీయ ని ర్బంధాన్ని పాటిస్తున్నారు. భైంసాలో ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. 

ఆదిలాబాద్‌ జిల్లాలో..

లాక్‌డౌన్‌తో ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో జనసంచారం లేక రోడ్లు ఖాళీగా కనిపించాయి. పో లీసులు పకడ్బందీ చర్యలు తీసుకొని వాహనా ల రాకపోకలను నియంత్రించారు. దోభీకాలనీ లో హైపోక్లోరైట్‌ స్ప్రే చేశారు. బోథ్‌ మండలం లో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రాలేదు. బోథ్‌లో వారసంత ఉన్నా వ్యాపారులు దుకాణాలను మూసి ఉంచారు. పట్నాపూర్‌లో గ్రా మస్తులు చెక్‌ పోస్టు ఏర్పాటు చేసి కాపలా ఉ న్నారు. ఉట్నూర్‌లో ఆర్డీవో వినోద్‌కుమార్‌, డీ ఎస్పీ ఉదయ్‌రెడ్డి, సీఐ నరేశ్‌కుమార్‌ లాక్‌డౌన్‌ ను పర్యవేక్షించారు. కుమ్రంభీం ప్రాంగణంలో ని యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో ఏర్పాటు చేయనున్న 50 పడకల క్వారంటైన్‌ సెంటర్‌ను ఆర్డీవో సందర్శించి సిబ్బందికి సూచనలు చేశారు. 

నిజామాబాద్‌ జిల్లాలో 

నగరంలో లాక్‌డౌన్‌ ప్రశాంతంగా కొనసాగుతున్నది. జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో హైపో క్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు. నందిపేటలో మధ్యాహ్నం వరకు కిరాణా షాపులు తెరిచి ఉంచగా, ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ నిత్యావసరాలు కొనుగోలు చేశారు. ఆర్మూర్‌ పట్టణంతోపాటు అన్ని గ్రామాల్లో లాక్‌డౌన్‌ కొనసాగుతున్నది. భీమ్‌గల్‌లో అగ్నిమాపక సిబ్బంది హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు. రుద్రూర్‌ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో 60 మందికి మాస్కులు, శానిటైజర్లను అందజేశారు. ధర్పల్లి మండలంలో ప్రజలు అత్యవసరాల సరుకుల కోసం తప్ప బయటకు రాలేదు. జక్రాన్‌పల్లి మండలంలో అధికారులు పలు గ్రామాల్లో పర్యటించి విదేశాల నుంచి వచ్చిన వారికి క్వారంటైన్‌ ముద్ర వేశారు.కేశ్‌పల్లి, చింతలూర్‌, కలిగోట్‌లో గ్రామ కమిటీల ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ చేశారు. ఇందల్వాయి మండలంలోని పలు గ్రామాల్లో అధికారులు పర్యటించి లాక్‌డౌన్‌ను పర్యవేక్షించారు.


logo