బుధవారం 03 జూన్ 2020
Adilabad - Mar 31, 2020 , 03:02:02

అందుబాటులోకి హోం డెలివరీ

 అందుబాటులోకి హోం డెలివరీ

ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ ప్రతినిధి : కరోనా నివారణలో ప్రజలు సామాజిక దూరం పాటించడం ప్రధానం కాగా, ఆ దిశగా జిల్లా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు.  లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలకు రోజూ కూరగాయలు, నిత్యావసర సరుకులు, మందులు లభించేలా చర్యలు తీసుకోవడంతో పాటు ఆరోగ్య పరమైన సమస్యలు వస్తే సంప్రదించడాని కోసం టెలీ మెడిసిన్‌ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. ఫోన్‌ ద్వారా ప్రజలకు నిత్యావసర సరుకులను వారి ఇంటికే చేరేలా చూడడంతో పాటు జిల్లా కేంద్రంలో తొమ్మిది చోట్ల కూరగాయల విక్రయ కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. 

సరుకుల పంపిణీకి ఆటోలు ఏర్పాటు.. 

ప్రజలు తమకు అవసరమయ్యే పాలు, కూరగాయలు, నిత్యావసర సరుకులు, మందులు, వైద్య సమస్యల కోసం ఎక్కువ సంఖ్యలో రోడ్లపైకి వస్తుండడం కరోనా వైరస్‌ కట్టడికి ఆటంకంగా మారింది. జిల్లా కేంద్రంలోని ప్రజలకు ఇంటికే వా రికి అవసరమైన నిత్యావసర వస్తువుల పంపేలా వ్యాపారులతో చర్చించి ఒప్పించారు. ఇందుకోసం 20 ఆటోలను అందుబాటులో ఉంచారు. వ్యాపారుల ఫోన్‌ నంబర్లను ప్రజలకు తెలియజేయడంతో పాటు వస్తువుల వివరాలు, అడ్రస్‌ చెబితే వారు ఇంటికే సరుకులను పంపుతారు. నామ మాత్రపు ఆటో చార్జీలు వినియోగదారులు చెల్లించాల్సి ఉంటుంది.  

అందుబాటులో వైద్య సేవలు.. 

ప్రజలు ఆరోగ్యసమస్యలతో ఇబ్బందులు పడకుం డా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆదిలాబాద్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ‘టెలీ మెడిసిన్‌ డెస్క్‌ ఆన్‌ కొవిడ్‌-19’ను ప్రారంభించారు. ఇం దులో ఓ వైద్యుడు, హౌస్‌ సర్జన్‌, వైద్యసిబ్బంది విధులు నిర్వహిస్తారు. కరోనా వ్యాధి లక్షణాలు జ్వరం, జలుబు, దగ్గు లాంటి ఇతర సమస్యలు ఉన్నవారు 08732- 231850కు ఫోన్‌ చేస్తే వారికి వైద్యులు అవసరమైన సలహాలు సూచన లు అందజేస్తారు. వీటితో పాటు ప్రజలకు మందు ల కోసం ఇబ్బందులు లేకుండా ఫోన్‌ ద్వారా ఇంటికే మందులు పంపించే ఏర్పాట్లు చేశారు.


logo