శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Adilabad - Mar 23, 2020 , 02:30:45

విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి వైద్య పరీక్షలు

విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి వైద్య పరీక్షలు

ఇంద్రవెల్లి : విదేశాల నుంచి స్వగ్రామాలకు వచ్చిన ఇద్దరు కార్మికులకు ఇంద్రవెల్లి పీహెచ్‌సీలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆదివారం ఎస్సై గంగారామ్‌, వైద్యుడు శ్రీకాంత్‌ తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని ఏమాయికుంట గ్రామానికి చెందిన పవార్‌ ప్రేమ్‌సింగ్‌, అందునాయక్‌తండా గ్రామానికి చెందిన జగదీశ్‌ కార్మికులుగా పనిచేస్తున్నారు. విరు చేస్తున్న పనులు ముగియడంతో వారిని యాజమాన్యం సెలవులు ప్రకటించింది. దీంతో తమ స్వగ్రామాలకు వచ్చారు. విషయాన్ని తెలుసుకున్న ఎస్సై గంగారామ్‌ ఏమాయికుంట సర్పంచ్‌ జాదవ్‌ లఖన్‌సింగ్‌ సహకారంతో ఇద్దరినీ మండలకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించి వైద్యుడు శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు చేశారు. వారికి వ్యాధులు లేవని వారు ఆరోగ్యంగానే ఉన్నారని, ముందు జాగ్రత చర్యగా 15 రోజులు ఇంట్లోనే ఉండాలని, బంధువులతోపాటు ఇంటి చుట్టుపక్కల వారి ఇండ్లలకు పోవద్దని సుచించామన్నారు. మండలంలోని దనోరా(బి) గ్రామానికి చెందిన ఓంప్రకాశ్‌, జయదీప్‌ వారి సొంత పనుల నిమిత్తం మహారాష్ట్రకు పోయివచ్చారన్నారు. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు వారిద్దరిని కూడా ప్రభుత్వ దవాఖానకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. వారిద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారన్నారు.  కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.


logo